నువ్వసలు ముస్లింవేనా? భార్య స్లీవ్ లెస్ ఫోటో షమీపై విమర్శలు | Shami slammed on Facebook over wife's dress.

Mohammed shami slammed on facebook over wife dress

Mohammed Shami, Shami Wife Hasin Jahan, Hasin Jahan sleeveless dress, Mohammed Shami religious bigotry, Hasin Jahan dress, social media Mohammed Shami, Shami slammed in Social Media, Kaif Shami Wife Photo, Mohammed Kaif rescued Shami, Indian Bowler Shami Wife

India pace spearhead Mohammed Shami became the latest victim of misplaced social media outrage and faces religious bigotry for posting an image of his wife Hasin Jahan in sleeveless gown. Kaif comes to defense.

భార్య స్లీవ్ లెస్ డ్రెస్ తో క్రికెటర్ కి చిక్కులు

Posted: 12/26/2016 11:46 AM IST
Mohammed shami slammed on facebook over wife dress

భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే మన దేశంలో ఈ టెక్కీ యుగంలో కూడా మతపరమైన కట్టుబాట్లపై కొన్ని సాంప్రదాయాలు పాటించాలన్న నిబంధనలు గట్టిగానే ఉన్నాయి. వాటిని అతిక్రమించారో ఎవరన్నది చూడకుండా ఏకీ పాడేయటం తరచూ జరుగుతూ వస్తోంది. టెన్నిస్ కోసం పొట్టి బట్టలు వేసుకునే సానియా మీర్జాపై అప్పట్లో తీవ్ర విమర్శలు వినిపించాయి. మత మర్యాదలను కాలరాస్తుందంటూ ఆమె పై పెద్ద ఎత్తున్న మండిపడ్డారు కొందరు మత ఛాందస వాదులు. ఇక ఇప్పుడు టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ వంతు వచ్చింది.

తన భార్య హసీన్ జహాన్ తో కలసి దిగిన ఓ ఫొటోను ఫేస్ బుక్ లో సరదాగా అప్ లోడ్ చేసిన పాపానికి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు . ఈ ఫొటోలో అతని భార్య హసిన్ జహాన్ స్లీవ్ లెస్ డ్రస్ ధరించి ఉంది. దీంతో అతనిపై కొందరు విమర్శల వర్షం కురిపించారు. నీవసలు ముస్లింవేనా... నీ భార్య ఇలాంటి డ్రస్ వేసుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. మరికొందరేమో వదినను పరదాలో ఉంచు అంటూ కొందరు సూచించారు.

నువ్వు చేసుకున్నది ముస్లింనా లేక హిందువునా అని ప్రశ్నించారు. ఇంకొదరేమో ఇండియాలో ముస్లింలు ఇలా ఉండాలి అంటూ తెలిపారు. మరోవైపు మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలబడ్డారు. వీరిలో క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నాడు.

కైఫ్ స్పందిస్తూ, "కొందరి వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయి. షమీకి నా మద్దతు ఉంటుంది. దేశంలో ఇంతకన్నా పెద్ద సమస్యలే ఉన్నాయి. కాస్త స్థిమితంగా ఆలోచించండి’’ అంటూ కామెంట్లు చేసిన వారిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Shami  Hasin Jahan  Sleeveless Gown  Facebook criticism  

Other Articles