బ్యాంకు, ఏటీఎం డబ్బు డ్రా చేస్తున్నారా ? అయితే ఇది చదవండి | Cash withdrawal surcharge soon.

Surcharge on cash withdrawal

Reserve bank of India, ATM surcharge, Withdrawal limit, Withdrawal surcharge, RBI tax, RBI surcharge, RBI Withdrawal limit, Bank and ATM withdrawal, no tax on online transactions, No surcharge online payment

RBI plan to levy surcharge on withdrawal after December 30.

విత్ డ్రా చేస్తే వాచిపోవటం ఖాయమేనా?

Posted: 12/22/2016 08:16 AM IST
Surcharge on cash withdrawal

పెద్ద నోట్ల రద్దుపై అర్థం కానీ రీతిలో ఆర్థికశాఖ, ఆర్బీఐలతో రోజుకో ప్రకటన గందరగోళం నెలకొల్పుతున్న కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు డ్రా చేస్తే సర్ ఛార్జీల పేరుతో భారీగా వసూలు చేసే యత్నాలు ప్రారంభించింది. సుమారు 0.5-2 శాతంతో సర్ చార్జి విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 30 తర్వాత పూర్తిస్థాయి నగదు అందుబాటులోకి వస్తుందని ప్రకటించిన నేపథ్యంలో సంతోషంలో ఉన్న ప్రజలకీ ఈ వార్త నెత్తి మీద పిడుగులాంటిదే అనుకోవచ్చు.

అయితే ప్రజలకు భారంగా అనిపించినా సరే ‘క్యాష్‌లెస్’ వైపు మళ్లించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. కనీస పరిమితికి మించి నగదు డ్రాచేసే వారికి సర్‌చార్జ్ విధించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ పరిమితి ఎంతన్న విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే అది బ్యాంకుల నుంచి అయితే రూ.50 వేలు, ఏటీఎంల నుంచి అయితే రూ.15 వేలకు మించి డ్రా చేస్తే నిర్వహణ వ్యయం పేరుతో సర్ చార్జి విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సర్ చార్జి నిబంధనను 4-6 మాసాలు అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ దాన్ని దీర్ఘకాలికంగానే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించటం కొసమెరుపు. ఇక పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన నగదు కొరత ఈ నెల 30 కల్లా పరిష్కారమవుతుందా? అన్న దానిపై ఎస్ బీఐ అరుంధతి రాయ్‌ సానుకూల సమాధానం ఇవ్వలేదు. నగదు సరఫరా ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి రావడంజరగదని పేర్కొన్నారు. కనీసం ఒకటి–రెండు నెలల్లో కూడా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితులు లేవన్నారు. క్రమక్రమంగా నగదు సరఫరా సాధారణ స్థితికి వస్తుందని వివరించారు.

ఆన్ లైన్ కి నో ఛార్జీ:
నోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించటంలో భాగంగా ఇప్పటికే పలు బంఫరాఫర్ లను ప్రకటించిన కేంద్రం మరో నిర్ణయం వెల్లడింది. తాజాగా ఖాతాదారులు వెయ్యి రూపాయలకుపైగా జరిపే ఆన్‌లైన్ లావాదేవీలపై ఎటువంటి చార్జీలు వసూలు చేయరాదని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఐఎంపీఎస్, యూపీఐ, ఎన్ఈఎఫ్‌టీపై ఎలాంటి చార్జీలు విధించవద్దని బ్యాంకులను ఆదేశించింది. అయితే ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథాతథంగా ఛార్జీలను వసూలు చేయనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : withdrawal limit  surcharge  Reserve bank of India  online payment  no surcharge  

Other Articles