మంత్రిగా పని చేసిన జానాకు ఆ మాత్రం తెలీదా? | KCR versus Janareddy in assembly.

Janareddy voice raised in assembly

Janareddy, Janareddy in assembly, Congress senior leader Janareddy, Janareddy KCR in assembly, KCR Janareddy, Janareddy fire on KCR, Agriculture debate in Telangana Assembly, Janareddy Harishrao, Janareddy winter session, Telangana winter session assembly

Congress leader Janareddy fire on Harish rao about assembly speech.

జానారెడ్డి తెలిసి కూడా అలా చేశాడా?

Posted: 12/22/2016 07:53 AM IST
Janareddy voice raised in assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ కి వ్యతిరేకంగా గళం విప్పేందుకు కాంగ్రెస్ సర్కార్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా బుధవారం సీఎల్పీ నేత జానారెడ్డి సభలో కాస్త గట్టిగానే వాయిస్ ను వినిపించారు. ఒకానోక దశలో సీఎం కేసీఆర్ తోనే కాస్త ఘాటైన సంభాషణ కొనసాగించిన ఆయన ఆపై మంత్రి హరీశ్‌రావుకు ఏకంగా క్లాస్ పీకినంత పని చేశాడు. చట్టసభలో సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్లవద్దంటూ హరీష్ కు సూచించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... వ్యవసాయంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో లేచిన మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ కోమటిరెడ్డి, సంపత్‌ పేర్లను ప్రస్తావించారు. హరీశ్‌రావు వివరణ అనంతరం ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

ఆపై ఎంఐఎం సభ్యుడు మొజాంఖాన్‌కు స్పీకర్ మైక్ ఇచ్చారు. అయితే మంత్రి తమ పేర్లను ప్రస్తావించారు కాబట్టి కాబట్టి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి, సంపత్‌లు కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. దీంతో కల్పించుకున్న జానారెడ్డి లేచి మాట్లాడారు. సభలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అంశాలను నోట్ చేసుకుని, వారు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఏం చేస్తుందో వివరణ ఇవ్వాలని, ఇది గతం నుంచి వస్తున్న సంప్రదాయమంటూ హరీశ్‌కు క్లాస్ తీసుకున్నారు.

కాంగ్రెస్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడిన మాటలకు తనకూ కౌంటర్ ఇవ్వాలని ఉందని, అంతే ఆయనా లేచి, నేనూ లేస్తే కౌంటర్లకే సమయం సరిపోతుందని అన్నారు. అంతా అయిన తర్వాతే మంత్రులు మాట్లాడాలని, గత సంప్రదాయాన్ని గౌరవించాలని హరీశ్‌కు సూచించటంతో కాసేపు అక్కడ సైలెంట్ వాతావరణం నెలకొంది.

జానా వర్సెస్ కేసీఆర్...
ఇక ఎంతసేపూ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో అట్లా.. ఇట్లా.. అంటూ చెప్పిందే చెప్పి.. అన్నదే అని.. ఏంటిది? మా ప్రభుత్వం పోయి మీ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మళ్లిస్తున్నారు. ఇదేనా పద్ధతి? అంటూ ఏకంగా కేసీఆర్ నే ప్రశ్నించగా, దానిపై టీ సీఎం సుదీర్ఘ వివరణే ఇచ్చుకోవాల్సి వచ్చింది.

‘‘కారణాలేవైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం బకాయిపడ్డ రూ.480 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని తెలంగాణ వచ్చాక మేం విడుదల చేసినమాట నిజమా కాదా..? రైతు రుణమాఫీలో 75 శాతం చెల్లించి మిగతా 25 శాతం ఇప్పుడు చెల్లించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పాడిందే పాడరా... అన్నట్టు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేత జానారెడ్డి ఇలా మాట్లాడ్డం సరికాదు..’’ జానా తీరును తీవ్రం గా తప్పుబట్టాడు కేసీఆర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janareddy KCR  Telangana Assembly winter session  

Other Articles