ముంచుకోస్తున్న మరో ఉపద్రవం.. నెల్లూరు జిల్లాలో అప్రమత్తం Vardah impact: high alert in Nellore

Vardah impact high alert in nellore

Bay of Bengal, cyclonic storm, featured, Odisha, Warda, Vardah, India Meteorological Department, Depression, Warda cyclone, Andhra Pradesh, cyclonic storm, visakhapatnam, Nicobar islands, Port Blair

Cyclone Vardah will make landfall close to Nellore December 12, a red alert has been sounded, district collector arranged control rooms for security of people

ముంచుకోస్తున్న మరో ఉపద్రవం.. నెల్లూరు జిల్లాలో అప్రమత్తం

Posted: 12/11/2016 03:09 PM IST
Vardah impact high alert in nellore

‘వార్దా’ తుపాను రానున్న మరికోన్ని గంటల్లో తీరం దాటనున్నందని భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. అది నెల్లూరు జిల్లా లోని తీర ప్రాంతంలో  కోస్త్రా ప్రజలను మరింత కలవరపాటుకు గురిచేస్తుంది. గంట గంటకూ బలపడుతన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. తుఫాను కారణంగా ప్రజలు ఎదుర్కోనే సమస్యల పరిష్కారించేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వార్దా తుపాను కారణంగా ముప్పు పొంచివుందన్న సమాచారంతో నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వార్దా తీవ్ర పెను తుపానుగా మారడంతో 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు. మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లతో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిందని చెప్పారు.

కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూమ్‌(1800-425-2499) ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వార్దా తుపాను సోమవారం సాయంత్రం చెన్నై-పులికాట్‌ సరస్సు మధ్య తీరం దాటే అవకాశముంది. ఈ సమయంలో 4 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా చేస్తున్నారు. తుపాను తీరం దాటేప్పడు గంటలకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles