విరాట్ జతకు జయంత్.. 20 ఏళ్ల రికార్డు సవరణ Kohli, Jayant Yadav put up record 241-run stand for 8th wicket

Kohli jayant yadav put up record 241 run stand for 8th wicket

India vs England, Mumbai, 4th Test, Live cricket score, Wankhede Stadium, Wankhede pitch, Virat Kohli, Jayant Yadav, India national cricket team, England cricket team, Cricket score

Indian skipper Virat Kohli and all-rounder Jayant Yadav put up a record partnership of 241 runs for the eighth wicket, on Day Four of the fourth Test against England

విరాట్ జతకు జయంత్.. 20 ఏళ్ల రికార్డు సవరణ

Posted: 12/11/2016 02:19 PM IST
Kohli jayant yadav put up record 241 run stand for 8th wicket

భారత సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ పై టీమిండియా క్రికెటర్లు వీరవిహారం చేస్తున్నారు. జట్టులో సీనియర్ బ్యాట్స్ మెన్లు లేకపోయినా.. వున్న యువ క్రికెటర్లు మంచి ఫామ్ లో వుండటంతో విరాట్ సేన కొత్త రికార్డను అందుకుంటుంది. నాల్గవ టెస్టులో భాగంగా ముంబై వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్టులో భారత్ క్రికెట్ జట్టు మరో రికార్డును సవరించింది మూడో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి పలు అరుదైన ఘనతలను సొంతం చేసుకోగా,  నాల్గవ రోజు ఆటలో మరో రికార్డులో భాగస్వామ్యం అయ్యాడు.

బ్యాటింగ్ ఆల్ రౌండర్ జయంత్ యాదవ్తో కలిసి ఎనిమిదో వికెట్కు అత్యధిక భాగస్వామ్యాన్ని లిఖించాడు. ఈ జోడి 161 పరుగులకు పైగా భాగస్వామ్యం సాధించారు. తద్వారా గతంలో భారత్ తరపున మొహ్మద్ అజహరుద్దీన్-అనిల్ కుంబ్లేలు నమోదు చేసిన అత్యధిక ఎనిమిదో వికెట్ భాగస్వామ్యాన్ని సవరించారు.

1996లో కోల్ కతాలో అజహర్-కుంబ్లేలు నమోదు చేసిన 161 పరుగులకే ఇప్పటివరకూ ఎనిమిదో వికెట్కు భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యం. ఈ రికార్డును దాదాపు 20 ఏళ్ల తరువాత టీమిండియా అధిగమించడం విశేషం. తొలి సెషన్లో వీరిద్దరూ రాణించడంతో భారత్ జట్టు ఐదు వందల పరుగుల మార్కును దాటింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 158.0 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 529 పరుగులు చేసింది. దాంతో భారత్ కు 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  jayanth yadav  india  england  fouth test  wankhede test  cricket  

Other Articles