శ్రీలంక క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం PCB in talks with West Indies, Sri Lanka for home series

Pcb in talks with west indies sri lanka for home series

pakistan cricket board, pcb, holding, talks, west, indies, sri, lankan, cricket boards, arrange, a, series, source, board, engaged, discussions, conclusion, pakistan super league, psl, final

The Pakistan Cricket Board (PCB) is currently holding talks with the cricket boards of West Indies and Sri Lanka over hosting a home series in the middle of next year.

శ్రీలంక క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం

Posted: 12/11/2016 05:01 PM IST
Pcb in talks with west indies sri lanka for home series

ఇటీవల జింబాంబ్వే పర్యటన తరువాత.. అంతకు ముందు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి పాకిస్తాన్లో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటానికి ప్రధాన జట్లు వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం సంగతి తెలిసిందే. తమ దేశంలో ప్రస్తుతం హోం సిరీస్ అడేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని అయన నిర్మోహమాటంగా చెప్పారు. ఇందుకు కారణం 2009లో లాహోర్ శ్రీలంక జట్టు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఉగ్రవాద దాడుల జరిగిన తరువాత పాక్లో అడుగుపెట్టేందుకు ఏ జట్టూ సాహసం చేయడం లేదు.

దాంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి వచ్చే ఆదాయంలో భారీ కోత పడుతోంది.  ఈ ఏడాది పాక్ లో వెస్టిండీస్ ఆడుతుందని భావించినా, అది కూడా నీరుగారిపోయింది. కేవలం పాక్ తటస్థ వేదిక యూఏఈలో మాత్రమే పాక్ తో ఆడటానికి విండీస్ ముందుకొచ్చింది.కాగా, పాక్ క్రికెట్ బోర్డు తమ ప్రయత్నాలను మాత్రం వదలు కోవడం లేదు.మరోసారి విండీస్ క్రికెట్ జట్టును తమ దేశంలో ఆడించాలనే పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగా ఆ జట్ల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.

మరొకవైపు గతంలో మిలిటెంట్ల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న శ్రీలంక జట్టుతో కూడా పాక్ బోర్డు చర్చలు జరుపుతోంది.ఇప్పటికే వారి మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పీఎస్ఎల్ ముగిసిన తరువాత వెస్టిండీస్, శ్రీలంక జట్లు మా దేశం వస్తాయని ఆశిస్తున్నాం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. 2017 మధ్య నెలల్లో ఆయా దేశాలు పాక్లో పర్యటించడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది'అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  sports  pcb  sri lanka  west indies cricket  wicb  

Other Articles