ప్రజల ఇబ్బందులను పక్కాదారి పట్టించేందుకు మోడీ బ్లాక్ మెయిల్ PM Modi blackmailing people says Mayawati

Pm modi blackmailing people decision taken for political gains says mayawati

demonetisation, narendra modi, demonetisation narendra modi, mayawati demonetisation, demonetisation, cash withdrawals, Rs 2000 notes, Rs 2000 notes terrorists, Rs 2000 notes original, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban

Mayawati said that the demonetisation move had brought nothing but economic emergency causing sufferance among the common people.

ప్రజల ఇబ్బందులను పక్కాదారి పట్టించేందుకు మోడీ బ్లాక్ మెయిల్

Posted: 11/27/2016 09:54 AM IST
Pm modi blackmailing people decision taken for political gains says mayawati

దేశం నుంచి అవినీతిని, నల్లధనాన్ని తరిమేసేందుకు తమ ప్రభత్వం పెద్దనోట్ల రద్దును విధించిందని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ.. తను వేసిన పాచిక పారడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేపథ్యంలో వారి దృష్టి మరల్చేందుకు దేశ ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ కన్నీళ్లు పెడుతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ప్రస్తుత బీజేపి పాలనపై దేశ ప్రజలు పెద్ద ఎత్తున అగ్రహంతో వున్నారని, ఈ నేపథ్యంలో రానున్న ఐదు రాష్ట్రల ఎన్నికలలో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క రాష్ట్రంలో గెలువలేరన్న ఉద్దేశ్యంతోనే మోడీ సర్కార్ పెద్దనోట్ల రద్దును తెరపైకి తీసుకువచ్చిందని అన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే మోదీ పెద్దనోట్లు రద్దు చేశారని మాయావతి ఆరోపించారు. ప్రజల కష్టనష్టాలు పట్టించుకోకుండా తాము చేసింది శాసనం అని, దానిని అందరూ తప్పక పాటించాలని అదేశించిన కేంద్రప్రభుత్వం దేశచరిత్రలో మోడీ ఒక్కరిదేనని దుయ్యబట్టారు. నోట్ల రద్దు చేసిన తరువాత పార్లమెంటులోకి వచ్చేందుకు జంకుతున్న ప్రధాని.. మీడియా ముందు, ఇతర సభలు, సమావేశాలకు మాత్రం వెళ్లి దేశ ప్రజలకు తన ప్రసంగాన్ని వినిపిస్తున్నారని అమె ధ్వజమెత్తారు.

ఈ నిర్ణయం వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని ఆమె తెలిపారు. ఈ నిర్ణయం కారణంగా ఏర్పడిన ఆర్థిక ఎమర్జన్సీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తాము రాజకీయ లబ్ధి కోసం గాక దేశ ప్రయోజనాల దృష్ట్యా వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ముందే బ్లాక్ మనీ సర్దుకున్న తరువాత ప్రధాని నోట్లను రద్దు చేశారని అరోపించారు. రెండున్నరేళ్ల ముందు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్న బీజేపి, అ తరువాత అభివృద్ది మంత్రం, ఇప్పుడు అవినీతి జమం చేస్తూ ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mayawati  bahujan samajwadi party  emotional blackmail  demonetisation  cash withdrawals  

Other Articles