రూ.100తో బోలెడంత ప్రచారాం.. ఇది స్మృతి ఇరానీకే సోంతం.. Smriti Irani pays Rs 100 to cobbler for getting slippers repaired

Smriti irani pays rs 100 to cobbler for getting slippers repaired

Union minister Smriti Irani, Smriti Irani, Smriti Irani Rs 100, Smriti Irani cobbler, Smriti Irani slippers, Smriti Irani viral news, Smriti Irani social media, Smriti Irani kerala, Smriti Irani coimbatore, Demonetisation, cash withdrawals, cash withdraw limits, Arun Jaitley, Rs 2000 notes, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI

Union minister Smriti Irani paid Rs 100 to a cobbler for getting her slippers repaired and the latter, who had demanded only Rs 10 for the job, happily put in additional stitches on it with the incident going viral on the social media.

ITEMVIDEOS: రూ.100తో బోలెడంత ప్రచారాం.. ఇది స్మృతి ఇరానీకే సోంతం..

Posted: 11/27/2016 09:08 AM IST
Smriti irani pays rs 100 to cobbler for getting slippers repaired

అవినీతి, నల్లధనాన్ని దేశం నుంచి తరమికోట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న చారిత్రక నిర్ణయం తరువాత మీడియాలో అగుపించకుండా పోయిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ దాదాపుగా 20 రోజులకు మళ్లీ వార్తల్లో నిలిచారు. అలాఇలా కాకుండా ఏకంగా అటు సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండ్ అవుతూ.. ఇటు మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయారు. ఇంతకీ కేంద్రమంత్రి చేసిందేమిటీ.. ఆలాంటి చర్యలను సామాన్యులు చేయలేరా..? అంతలా ఎందుకని అమె ట్రెండ్ అవుతున్నారు..?

ఇక మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే.. కేరళ రాజధాని కోయంబత్తూర్ లో ఇషా ఫౌండేషన్ నిర్వహించే ఓ బిజినెస్ లీడర్ షిఫ్ సమీక్షలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో విమానం దిగుతుండగా ఆమె కాలి చెప్పులు తెగిపోయాయి. దీంతో విమానాశ్రయం వద్ద అమె రాకను తెలుసుకుని వేచివున్న మీడియాతో కూడా అమె మాట్లాడటానికి నిరాకరించారు. అయితే అప్పటికీ మీడియాకు విషయం తెలియకపోవడంతో ఊసురుమంటూ వెనుదిరిగారు. ఇలా విమానాశ్రయం నుంచి బయటపడ్డిన స్మృతి ఇరానీ.. ఇక తన అన్వేషణ ప్రారంభించారు.

ఎవరి కోసం అనుకుంటున్నారు. ఖరీదైన చెప్పుల దుకాణం కోసం కాదండీ.. చెప్పులు కుట్టే మోచీ వ్యక్తి కోసం. అమె కొయంబత్తూర్ పట్టణానికి చేరువవుతున్న సందర్భంలో పట్టణ శివార్లలోని పెరూరులో రోడ్డు పక్కన చెప్పులు కుట్టే వ్యక్తి కనిపించారు. దీంతో కారు ఆపిన ఆమె అతని వద్దకు వెళ్లి చెప్పులు కుట్టించుకున్నారు. ఆయన చెప్పులు కుట్టినంతసేపు ఆమె అతని పక్కనే స్టూలుపై కూర్చున్నారు. చెప్పులు కుట్టడం పూర్తయిన తరువాత ఎంతైందని ఆమె అతనిని అడిగారు. పది రూపాయలని ఆయన చెప్పడంతో అతని చేతిలో 100 రూపాయలు పెట్టారు.

దీంతో మీడియా ఎంట్రీ ఇచ్చింది. చెప్పులు కుట్టిన గణేశ్ అనే వ్యక్తిని మీడియా పలుకరించింది. అయితే అమె ఎవరో తనకు తెలియదని, అమె తన చెప్పులు కుట్టించుకోడానికి వచ్చిందని, అయితే తన వద్ద చిల్లర లేవని, దీంతో తన కష్టానికి ఫలితంగా రావాల్సిన పది రూపాయలకు బదులు వంద రూపాయలను ఇచ్చి వెళ్లిందని గణేశ్ తెలిపాడు. ఇది సోషల్ మీడియాలో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె నిరాడంబరమైన వ్యక్తి అని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి వీడియోను, ఫోటోలను తమిళనాడు బీజేపి యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు సూర్య ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి.

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా వున్న సమయంలో తన కాన్వాయ్ ఓ డాక్డర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని అతను మరణించిన తరువాత ఘటనను చూసిన కేంద్రమంత్రి తన కాన్వాయ్ ను మళ్లించి వెళ్లిపోయిందని, మృతుడి సంతానం అభ్యర్థించినా వైద్యుడిని అస్పత్రికి తరలించడానికి విముఖత వ్యక్తం చేసిందన్న అరోపణలు రావడంతో.. అసలు అమెకు మానవత్వం లేదని కూడా అరోపణలు వచ్చాయి. అదే కేంద్రమంత్రి తాజాగా వంద రూపాయంలో బోలెడంత ఫ్రీ పబ్లిసీటి సంపాదించి.. తనలోని నిరాడంబర తత్వాన్ని చాటుకున్నారని ఇప్పుడు నెట్ జనులు ప్రశంసలు కురిసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  Rs 100  cobbler  slippers  viral news  social media  Demonetisation  coimbatore  kerala  

Other Articles