ఢిల్లీలో ఇక పటాసులు కనిపించవా? | Supreme Court bans sale of firecrackers in Delhi.

Sale of firecrackers banned in delhi ncr

Supreme Court, sale of fire crackers, Delhi-NCR, No Crackers in Delhi, Supreme Court Crackers, Delhi Sale of Crackers, fire crackers in Delhi, Delhi pollution, Supreme Court Delhi Air Pollution

Supreme Court bans sale of fire crackers in Delhi-NCR to curb rising air pollution.

ఢిల్లీలో బాణాసంచాలపై సుప్రీం నిషేధం!

Posted: 11/25/2016 04:29 PM IST
Sale of firecrackers banned in delhi ncr

ప్రపంచ కాలుష్య కోర నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ టాప్ టెన్ ప్లేస్ లో నిలిచింది. ఓవైపు వాహనాలు, మరోవైపు పరిశ్రమలు ఇలా వాయుకాలుష్యంతో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. వీధులన్నీ కాలుష్యంతో కూడిన పొగమంచుతో నిండిపోవడంతో రోడ్లమీదికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా దీపావళి తర్వాత ఆ పరిస్థితి ఎమర్జెన్సీని తలపించింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఢిల్లీ ప్రభుత్వం కూడా పాఠశాలలకైతే ఏకంగా మూడు రోజుల సెలవు ప్రకటించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. ఢిల్లీలోపాటు ఎన్ సీఆర్ ఏరియాలో బాణసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఢిల్లీలో శబ్ధ మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమ్మకందారుల లైసెన్స్ లు రద్దు చేయాలని, ప్రస్తుతానికి కొత్త లైసెన్స్ లు జారీ చేయవద్దని, బాణసంచావల్ల కలిగే దుష్ప్రభావాలపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

అంతేకాదు తయారు చేస్తున్న బాణాసంచాలలో హానికారక పదార్థాల వాడకంపై విచారణ చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇప్పటికే ఢిల్లీ కాలుష్య కాసారంగా మారింది. విషవాయువుల ప్రభావం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కూడా పండగ సమయంలో తప్ప మిగతా వేళలో బాణాసంచాలు పేల్చొద్దంటూ ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంను కోరాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Crackers  sale  ban  Delhi and NCR  

Other Articles