అన్నాడీఎంకే కార్యకర్తలకు త్వరలో బంగారు పలుకులు.. Jayalalithaa's First Words, Using Speakers

After 2 months in hospital jayalalithaa s first words using speakers

jayalalithaa, tamilnadu chief minister, Jayalalithaa health update, lung infection, chennai apollo hospital, Apollo chiarman, Dr Prathap Reddy, discharge, C Ponnaiyan, AIADMK, Jayalalithaa Apollo Hospital, Jayalalithaa Health Update, Tracheostomy, Jayalalithaa Tracheostomy

Tamil Nadu chief minister J Jayalalithaa, who has had a tracheostomy after a severe lung infection, is now speaking for a few minutes at a time using speakers

అన్నాడీఎంకే కార్యకర్తలకు త్వరలో బంగారు పలుకులు..

Posted: 11/25/2016 04:25 PM IST
After 2 months in hospital jayalalithaa s first words using speakers

జ్వరం, ఊపిరితిత్తులలో ఇన్ఫక్షన్ సోకడంతో సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో అస్పత్రిలో చేరి.. సుమారు 64 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అరోగ్యం విషయంలో అన్నాడీఎంకే వర్గాలకు మరో తీపి కబరు అందింది. గత కొన్నాళ్లుగా అమ్మా ఎప్పుడెప్పుడు వచ్చి పాలనా పగ్గాలను అందుకుంటారా అని ఎదురుచూస్తున్న తమిళనాట ప్రజలకు శుభవార్త అందించారు అపోలో వైద్యులు.

పురచ్చి తలైవి పూర్తిగా కోలుకున్నారని, ఆమె కీలక అవయవాలన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. కాలర్ మైకు ద్వారా ఆమె కొద్ది నిమిషాలు మాట్లాడారని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు ప్రతిరోజూ కొంతసేపు కృత్రిమ శ్వాస అందిస్తున్నామని.. అయితే 90 శాతం సమయం మాత్రం ఆమె తనంతట తానే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. ఆమెకు స్టాటిక్ మరియు యాక్టివ్ ఫిజియోథెరపీ అందిస్తున్నామని.. ఇక తర్వాత ఆమె లేచి నిలబడి, నడవడమే తరువాయి అని వివరించారు.

అమె త్వరలోనే తన కార్యాలయ బాధ్యతలను చేపడతారని కూడా అశాభావం వ్యక్తం చేశారు. కాగా ఎప్పుడు డిశ్చార్జి కావాలన్నది అమె ఇష్టమని ఆయన అన్నారు. కాగా మరో పక్షం రోజుల్లో అమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గతంలో మీ ప్రేమాభిమానాలు, ప్రార్థనలతోనే తనకు పునర్జన్మ లభించిందని పార్టీ వర్గాలు వెల్లడించిన ప్రకటనలో అమ్మ పేర్కన్నారు. అయితే అమ్మ నేరుగానే మాట్లాడుతుందన్న సమాచారంతో త్వరలోనే అమ్మ తమనుద్దేశించి ప్రసంగిస్తుందన్న అన్నాడీఎంకే వర్గాలు అసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles