రైలు ప్రమాద బాధితులకు రద్దు చేసిన 500 నోట్ల పంఫిణీ.. ఘోర ప్రమాదం.. Some Injured Mysteriously get Scrapped Rs 500 notes

Kanpur train accident some injured mysteriously get scrapped rs 500 notes

Rs 500 notes, Rs 1000 notes, Kanpur train accident, Kanpur train accident, Kanpur train derailment, Patna-Indore train accident, Patna Indore Express, Northern Central Railway, Patna-Indore, Major train accidents in India, Patna-Indore death toll, Railway helpline, Kanpur, TrainTragedy, 133 people died, Patna- Indore Express, Suresh Prabhu, train derailment

Some passengers injured in the Kanpur train derailment mysteriously received cash on , mostly in the denomination of scrapped Rs 500 notes.

రైలు ప్రమాద బాధితులకు రద్దు చేసిన 500 నోట్ల పంఫిణీ..

Posted: 11/21/2016 12:43 PM IST
Kanpur train accident some injured mysteriously get scrapped rs 500 notes

ఇండోర్-పాట్న ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో గాయపడి.. అస్పత్రులలో చికిత్స పోందుతున్న బాధితులకు చెలామణిలో లేని 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను గుర్తుతెలియని వ్యక్తులు పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తమ గాయాలకు తగిలిన నోప్పులతో వారు బాధవడుతున్న క్రమంలో వారిలో కొందరికి నిన్న ఊహించని విధంగా రద్దైన రూ. 500 నోట్లు అందాయి. ఒక్కొక్కరికి రూ. 5000ల వంతున ఐదు 1000 నోట్లు, పది 500 నోట్లను గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చి వెళ్లడమే చర్చకు దారితీసింది.

రైలు ప్రమాద ఘటనలో గాయపడ్డిన బాధితులకు ఐదు వేల రూపాయల చెలామణిలో లేని నోట్లను అందించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, మరికోందరు బాధితుల బంధువులు వాటిని తీసుకోవడానికి కూడా నిరాకరించారని సమాచారం. ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి బంధువు మాట్లాడుతూ, రైల్వే శాఖ వారు ఈ డబ్బును ఇచ్చారంటూ తమకు డబ్బిచ్చిన వ్యక్తి చెప్పాడని తెలిపారు. అయితే, ఈ డబ్బును రైల్వే శాఖ పంపించిందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కాన్పూర్ జోన్ కమిషనర్ ఇఫ్తికారుద్దీన్ తెలిపారు.

దీనిపై బీజేపీ నేత ఆర్పీ సింగ్ మాట్లాడుతూ, డబ్బులు ఎవరు పంచారనే విషయంలో క్లారిటీ లేదని తెలిపారు. రైల్వే సిబ్బంది ఈ డబ్బును పంచారా లేదా ఎవరైనా రాజకీయ నేతలు ఈ పని చేశారా అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. ఒకవేళ రైల్వే సిబ్బంది ఈ డబ్బును పంచి ఉంటే ఇది చాలా బాధాకరమైన అంశమని చెప్పారు. రాజకీయ నేతలు ఈ పని చేసి ఉంటే... ఇది మరింత బాధ కలిగించే అంశమన్నారు. చెల్లని నోట్లను క్షతగాత్రులు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles