రూ.2000 నోటుపై మరో సంచలన వాదన.. Issuance of Rs 2,000 note is ‘Illegal act’, says Anand Sharma

Issuance of rs 2 000 note is illegal act says anand sharma

congress, anand sharma, aprliament, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Senior Congress leader Anand Sharma blames Modi government of not following the law in issuance of new currenect notes and vowed to raise the issue inside and outside Parliament.

రూ.2000 నోటుపై మరో సంచలన వాదన..

Posted: 11/21/2016 01:16 PM IST
Issuance of rs 2 000 note is illegal act says anand sharma

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంపై మాట అటుంచింతే.. రెండు వేల రూపాయల కొత్త నోటును ముద్రించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతం అవుతుందని ఒకవైపు ప్రచారం చేస్తూనే.. మరోవైపు రెండు వేల రూపాయల కోత్త నోటును ఎలా తీసుకువచ్చారన్న ప్రశ్నలు అన్ని వర్గాల ప్రజల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. ఈ తరుణంలో అసలు ఈ నోటు ముద్రణ చట్టవిరుద్దంగా జరిగిందంటూ కొత్త వాదన తెరపైకి వస్తుంది.

ప్రధాని మోదీ రెండువేల రూపాయల నోటును చ‌ట్ట‌విరుద్ధంగా తీసుకువ‌చ్చార‌ని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ మాట్లాడుతూ... భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు చట్టం ప్రకారం కొత్త నోట్ల‌ ముద్రణ కోసం నోటీఫికేషన్ జారీ చేసి, అనంత‌రం వాటిని విడుదల చేయాల్సి ఉండ‌గా దానికి విరుద్ధంగా కొత్త నోట్ల‌ను తీసుకొచ్చార‌ని అన్నారు. ఈ అంశంపై తాము ప్రజలతో కలిసి పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక అరాచ‌క‌త్వం కొన‌సాగుతోంద‌ని అక్షేపించిన అయన ప్రధాని నరేంద్రమోడీ దేశం మొత్తానికి సూక్తులు చెబుతూ.. తాను మాత్రం అడ్డదారిలో అక్రమంగా కొత్త రెండు వేల రూపాయల నోటును తీసుకువచ్చారని మండిపడ్డారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై పార్లమెంటు లోపల, వెలుప‌లా మోదీ స‌ర్కారుపై గ‌ళ‌మెత్తుతామ‌ని ఆనంద్ శర్మ తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  anand sharma  parliament  banks  ATMs  Rs 500  Rs 1  000  notes exchange  RBI  Rs 2000  

Other Articles