ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వెల్లివిరుస్తున్న తరుణంలో.. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు మోగా బ్రదర్ నాగబాబు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ నిర్ణయంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన తరుణంలో.. నాగబాబు.. ఎలాంటి సందేహం లేకుండా నిర్మోహమాటంగా ప్రధానికి మద్దతు ప్రకటించారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశ అభివృద్దికి, పురోగతి దోహదం చేస్తుందని అకాంక్షించారు.
వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేల నోటును కూడా రద్దు చేసి, కొత్త నోటు తీసుకు వస్తే స్వచ్ఛమైన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రముఖ నటుడు నాగబాబు విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దుపై గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్రలో నిలిచారని నాగబాబు కొనియాడారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ భవిష్యత్ ను మార్చడం తథ్యమని అన్నారు. ప్రజలందరూ మోదీ తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని కోరారు.
ఇంచుమించు 70 ఏళ్ల తర్వాత ఈ దేశం బాగుపడటానికి తీసుకున్న అద్భుత నిర్ణయం పెద్దనోట్ల రద్దు అని కొనియాడారు. ఈ మేరకు తన అభిప్రాయాలతో కూడిన వీడియో ఇంటర్వ్యూను యూట్యూబ్లో పెట్టారు. తాను మోదీ అభిమానిని కాదని, కనీసం బీజేపీ సభ్యుడిని కూడా కాదని, బీజేపీతో తనకు అభిప్రాయభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై రాజకీయనాయకులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాజకీయ నాయకులు మోదీపై విమర్శలు మానుకోవాలని నాగబాబు కోరారు.
భారతదేశానికి ప్రస్తుతం స్వాతంత్ర్యం మరి ఎక్కువైపోయిందని, ఇలాంటి సమయంలో నియంతలాంటి నేత దేశానికి అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి మంచి మనస్సుతో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే నేత రావాలని తాను చిన్నప్పటి నుంచి అనుకునేవాడినని, మోదీ రాకతో అది నెరవేరిందన్నారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో తాను కూడా షాక్ అయ్యానని, అయితే దీని గురించి ఆలోచిస్తే ఇది మంచి నిర్ణయమో తెలిసిందని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more