రైలు ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు.. Strict action will be taken against those responsible, says Suresh Prabhu

Strict action will be taken against those responsible says suresh prabhu

kanpur, patna indore train, train accident, suresh prabhu, railway minister, train accident deaths, kanpur train accident, indore express train accident, suresh prabhu railway minister, Kanpur, TrainTragedy, 100 people died, Patna- Indore Express, Suresh Prabhu, train derailment

Union Minister of Railways Suresh Prabhu said that strictest possible action will be taken against those who are found responsible for the derailment of Patna-Indore express near Kanpur.

రైలు ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు..

Posted: 11/20/2016 09:48 AM IST
Strict action will be taken against those responsible says suresh prabhu

పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సీనియర్‌ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. రైల్వే సహాయ మంత్రి ఘటనా స్థలానికి బయలుదేరారని వెల్లడించారు.

ప్రమాదంపై ఆయన వరుసగా ట్విట్టు చేస్తూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. క్షతగాత్రులందరికీ తక్షణ వైద్య సహాయం అందించాలని అదేశించారు. తీవ్ర గాయాలపాలైన వారిని వెంటనే స్థానిక అస్పత్రులలో చేర్పించాలని అయన రైల్వే అధికారులను అదేశించారు. కాగా, స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలని యూపీ డీజీపీని ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 63 మందిపైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanpur  TrainTragedy  100 people died  Patna- Indore Express  Suresh Prabhu  train derailment  

Other Articles