కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం.. Bihar Woman allegedly raped on moving train

Woman robbed raped in ladies coach of moving train in delhi

woman rape, delhi woman rape, train woman rape, woman rape in india, delhi woman rape, bihar woman rape, delhi crimes, crimes against woman, woman crimes, india news

Three assailants entered the ladies coach of Jan Nayak Express, with the intention to rob the passengers, when it was diverted to Old Delhi railway station.

కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం..

Posted: 11/20/2016 10:32 AM IST
Woman robbed raped in ladies coach of moving train in delhi

మహిళలపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రైలులోని మహిళల కోచ్ లోకి మగవాళ్లు ఎక్కకూడదన్న నిబంధన వున్నా ఎక్కిన మగమదమృగాళ్లు.. మహిళల కంపార్టుమెంట్లలోకి చోరబడటంతో పాటు ఓ ప్రయాణికురాలపై అత్యాచారానికి పాల్పడ్డారు. తమ బంధువుల పెళ్లికి వెళ్తున్న ఓ మహిళపై ఈ దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఆమెపై దుండగులు దుర్మార్గానికి పాల్పడ్డారు.

ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడమే కాకుండా వారిలో ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని షాదారా నుంచి పాత ఢిల్లీ రైల్వే స్టేషన్‌ మధ్య చోటుచేసుకుంది. అది కూడా మహిళల కోచ్‌లో. పోలీసుల వివరాల ప్రకారం పాత ఢిల్లీ స్టేషన్‌కు వెళ్లే రైలులోని ఓ మహిళల కోచ్‌ లో ఐదుగురు మహిళలు ఉన్నారు. అందులో నుంచి నలుగురు షాదారాలో దిగిపోగా ఒక 32 ఏళ్ల మహిళ మాత్రం అందులోనే ఉంది.

సరిగ్గా అక్కడే ముగ్గురు దుండగులు లేడీ కోచ్‌ లోకి వచ్చారు. ఆమె నుంచి విలువైన వస్తువులు దోచుకుని ఇద్దరు పారిపోగా ఒక దుండగుడు మాత్రంపై ఆమెపై చేయిచేసుకొని, దారుణంగా కొట్టి లైంగిక దాడికి దిగాడు. అయితే, ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఈ లోగా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతడిని షాబాజ్‌(25) అనే యువకుడిగా గుర్తించారు. బాధితురాలిది బిహార్‌.  వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే ఈ దురాగతం నేపథ్యంలో మహిళల కంపార్టుమెంట్లలో కూడా వారికి భధ్రత లేదని, పోలీసుల రక్షణ కూడా కరువైందని స్పష్టమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 32 year old woman  rape  robbed  ​​​​​moving train  robbed  molested  delhi  crime  

Other Articles