ఉత్తర్ ప్రదేశ్ లో పట్టాలు తప్పిన రైలు.. ఘోర ప్రమాదం.. Kanpur train tragedy: Death toll rises to 100, rescue ops on

Kanpur train tragedy death toll rises to 100 rescue ops on

Kanpur train accident live, Kanpur train accident, Kanpur train derailment, Patna-Indore train accident, Patna Indore Express, Northern Central Railway, Patna-Indore, Major train accidents in India, Patna-Indore death toll, Railway helpline, Kanpur, TrainTragedy, 100 people died, Patna- Indore Express, Suresh Prabhu, train derailment

As many as 120 people were killed when 14 coaches of the Patna-Indore Express derailed near Pukhrayan in Kanpur district early

ఉత్తర్ ప్రదేశ్ లో పట్టాలు తప్పిన రైలు.. ఘోర ప్రమాదం..

Posted: 11/20/2016 09:19 AM IST
Kanpur train tragedy death toll rises to 100 rescue ops on

ఉత్తరప్రదేశ్‌లో విషాదం సంభవించింది. ఉత్తర్ ప్రదేశ్ లోని పుక్రాయ వద్ద ఇండోర్ పాట్న ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం వేకువజామున రైలు పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  ఈ ఘటనలో 95 మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక అసుపత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్‌ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 95మంది మృతిచెందగా, 100కు పైగా  ప్రయాణికులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాద ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులను వివరాలు ఆరా తీస్తున్నారు. సహాయకచర్యలు వేగమంతం చేయాలని ఆదేశించారు.

జనరల్ బోగీలతో , A1, B1, B2, B3, BE, S1, S2, S3, S4, S5, S6, లగేజ్ ర్యాక్ బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగడంతో ప్రమాదలో మృతుల సంఖ్య అధికంగా వుందని అధికారులు తెలపుతున్నారు. రైలు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు రైల్వే అధికారి అనిల్ సక్సేనా చెప్పారు. రైలు ప్రమాదం ఘటన కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanpur  TrainTragedy  100 people died  Patna- Indore Express  Suresh Prabhu  train derailment  

Other Articles