అధ్యక్ష హోదాలో చిట్ట చివరి పర్యటన.. పెరులో ఒబామా Obama Arrives in Peru in Last Stop on Final World Tour

Obama arrives in peru in last stop on final world tour

Government and politics, Barack Obama, Pedro Pablo Kuczynski, Xi Jinping, United States government, Peru, Lima, Berlin, South America, Latin America and Caribbean, Germany, Western Europe, Europe, international news, world news, foreign news

President Barack Obama walks across the tarmac with Second Vice President of Peru Mercedes Araoz, during his arrival at Jorge Chavez International Airport in Lima, Peru.

అధ్యక్ష హోదాలో చిట్ట చివరి పర్యటన.. పెరులో ఒబామా

Posted: 11/19/2016 01:53 PM IST
Obama arrives in peru in last stop on final world tour

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండు వరుస పర్యాయాలు కొనసాగుతున్న బరాక్ ఒబామా అధ్యక్ష హోదాలో సాగిస్తున్న చిట్టచివరి పర్యటనలో భాగంగా పెరూలో అడుగుపెట్టారు. అధ్యక్ష స్థానంలో ఉండి చివరగా చేస్తున్న విదేశీ పర్యటనలో భాగంగా బెర్లిన్ నుంచి బయలుదేరిన ఆయన ప్రయణిస్తున్న ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ పోర్చుగల్లో ఇంధనం నింపుకొని శుక్రవారం సాయంత్రం లిమాలో దిగింది. పెరూలో అధ్యక్షుడు పెడ్రో పబ్లో కుస్జిన్స్కీతో సమావేశం ద్వారా ఆయన తన షెడ్యూలును ప్రారంభిస్తారు.

అనంతరం టౌన్ హాల్లో వందలమంది యువకుల మధ్య ప్రసంగించనున్నారు. ఇక్కడే ఆయన చివరగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం లిమాలో జరగనున్న ఆర్థిక సదస్సులో ఆసియా ప్రాంత నాయకులను, ఆస్ట్రేలియా నాయకుడిని ఒబామా కలవనున్నారు. అనంతరం పత్రికా సమావేశం నిర్వహించి తిరిగి సోమవారం ఉదయం శ్వేత సౌదానికి చేరుకుంటారు. దీంతో ఒబామా పర్యటనలు పూర్తి కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Pedro Pablo Kuczynski  US president  Peru. Presidential Tour  

Other Articles