ప్రాణం తీసిన మాతాజీ.. తప్పు చేయలేదట Sadhvi Deva Thakur surrenders in Karnal

Sadhvi deva thakur surrenders in karnal

sadhvi deva thakur, sadhvi deva thakur arrest, gun fire, wedding, haryana, haryana celebratory firing, all indian hindu mahasabha, india news

All Indian Hindu Mahasabha leader Sadhvi Deva Thakur surrendered before a local court in Karnal, Haryana after she had fired a few rounds during a wedding ceremony.

ప్రాణం తీసిన మాతాజీ.. తప్పు చేయలేదట

Posted: 11/19/2016 01:18 PM IST
Sadhvi deva thakur surrenders in karnal

తనకు తాను దైవాంష సంభూతురాలిగా పేర్కొంటున్న మాతాజీ విపరీత పోకడలు ఈ మధ్య వెలుగులోకి వచ్చి భక్తులను విస్మయానికి గురిచేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాతాజీలు అభియోగాల నేపథ్యంలో వివాదాలను ఎదుర్కోంటుండగా, అప్పట్లో రాధేమా మరింత శృతిమించి వివాదాల్లో చిక్కుకుని మాతాజీల వ్యవహార తీరుపై భక్తులను అప్రమత్తం చేశారు. తాజాగా పెళ్లి వేడుకలో కాల్పులు జరిపి ఒకరి మరణానికి కారణమైన మాతాజీ మాతా సాధ్వి దేవ ఠాకూర్.. గత కొన్ని రోజులుగా పరారీ వున్న అమె ఎట్టకేలకు కర్నల్ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.

అయితే తాను  కాల్పుల ఘటనకు సంబంధించి ఒకరి ప్రాణం తీసిన అమె.. ఏ తప్పూ చేయలేదని బుకాయించడం మాత్రం అపలేదు. కాగా ఏ తప్పు చేయని అమె ఇన్నాళ్లు ఎందుకు పరారయ్యారన్న విషయాం అమెకు తెలియాలి. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లి తంతు జరగుతుంటే తుపాకీతో గాల్లోకి సరదాగా కాల్పులు జరుపుతారు. ఈ వారం మొదట్లో హర్యానాలోని కర్నల్ జిల్లాలో సావిత్రి లాన్స్ అనే కళ్యాణ మండపంలో ఓ వివాహం జరిగింది. అందులో పాల్గొన్న సాధ్వి దేవతో పాటు ఆమె అనుచరులు తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మేనత్త చనిపోగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.  

కాల్పులు జరిపిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరినీ హత్యచేయలేదని.. తనతో పాటు మరికొందరు కాల్పులు జరిపారని పోలీసులకు శుక్రవారం ఆమె తెలిపారు. తాను కాల్పులు జరపగా, ఏ ఒక్కరు గాయపడలేదని చెప్పారు. వాస్తవానికి పోలీసులకు లభ్యమైన వీడియోలో మరో వ్యక్తి కూడా గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధ్వి దేవ జరిపిన కాల్పుల వల్లే వరుడి మేనత్త చనిపోవడంతో ఆమె పరారయిందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కర్నాల్ పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : godwoman fires  sadhvi deva thakur  gun fire  wedding  haryana  

Other Articles