ఇంగ్లాండ్ పై తొలిఇన్నింగ్స్ లో పైచేయి సాధించిన టీమిండియా Ravichandran Ashwin stars as England end first innings at 255

Ravichandran ashwin stars as england end first innings at 255

India vs England, visakha test, england first innings, virat kohli, Ravichandran ashwin. Team india, second test, day 1, score update, r ashwin, wriddhiman saha, Virat Kohli, Adil Rashid ,India vs England score

Star off-spinner Ravichandran Ashwin notched up a five-wicket haul as England were bowled out for 255 in their first innings on the third day of the second cricket Test against India

ఇంగ్లాండ్ పై తొలిఇన్నింగ్స్ లో పైచేయి సాధించిన టీమిండియా

Posted: 11/19/2016 02:28 PM IST
Ravichandran ashwin stars as england end first innings at 255

విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. 103/5 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ కు బెన్ స్టోక్స్(70), బెయిర్ స్టో(53)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ జోడి 110 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యం సాధించినా, మిగతా ఆటగాళ్లు  వైఫల్యం చెందారు. ఆ తరువాత రషిద్(32 నాటౌట్) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.

లంచ్ సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసిన ఇంగ్లండ్.. ఆ తరువాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. తొలుత ప్రమాదకరంగా ఉన్న బెన్ స్టోక్స్ ను భారత్ అవుట్ చేసింది. అశ్విన్ బౌలింగ్ లో స్టోక్స్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆపై స్వల్ప వ్యవధిలో అన్సారీని జడేజా పెవిలియన్ కు పంపాడు. అయితే స్టువర్ట్ బ్రాడ్ మాత్రం కాసేపు భారత్ ను ప్రతిఘటించే యత్నం చేశాడు. కాగా, ఇన్నింగ్స్ 102ఓవర్ లో బ్రాడ్ను అశ్విన్ ఎల్బీగా అవుట్ చేశాడు. ఆ తరువాత బంతికి అండర్సన్ కు కూడా ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ రోజు ఇంగ్లండ్ కోల్పోయిన ఐదు వికెట్లలో అశ్విన్ మూడు తీయగా, జడేజా, ఉమేశ్ యాదవ్ లకు తలో వికెట్ దక్కింది. ఓవరాల్ గా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో ఐదుగురు ఆటగాళ్లు ఎల్బీగా పెవిలియన్ చేరడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  visakha test  first innings  Ravichandran ashwin. Team india  cricket  

Other Articles