చుక్కలు చూపిన వ్యక్తిని పోలీసులకు పట్టించిన యువతి Woman calls 911 on enraged DUI driver

Woman calls 911 on enraged dui driver

Fatima Tsouli, Jowen Moses, drunk road rage, Arizona, drunk driver, accident, crash, american police, US police, america crime news,

Police say a terrified 911 caller describes in real-time a man following her car and smashing into her in a drunk-driving road rage incident in Arizona.

చుక్కలు చూపిన వ్యక్తిని పోలీసులకు పట్టించిన యువతి

Posted: 11/19/2016 11:59 AM IST
Woman calls 911 on enraged dui driver

అరిజోనాలో ఓ యువకుడు మధ్యం మత్తులో ఓ యువతికి చుక్కలు చూపించాడు. కారులో వెళుతున్న ఫాతిమా సౌలి అనే అమ్మాయిని జోవెనె మోసెస్ (25) అనే వ్యక్తి తాగిన మైకంలో వెనుక నుంచి ఢీకొడుతూ వెంబడించాడు. దాదాపు 25 నిమిషాలపాటు రహదారిపై ఓ చేజింగ్లాంటి భారీ దృశ్యం ఆవిష్కృతమైంది. అది కూడా రాత్రి పూట కావడంతో ఆమెకు గుండె ఆగిపోయినంత పనైంది. హర్రర్ సినిమాలో వెంబడించినంత భయంకరంగా అతడు ఆమెను పరుగెత్తించాడు.

రెండు మూడుసార్లు వెనుక నుంచి పక్క నుంచి ఆమె కారును బలంగా ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. ఆ షాక్లో నుంచి బయటకు వచ్చిన యువతి 911 ఫోన్ చేసి పోలీసులకు కబురు చేసింది. అతడి నుంచి తప్పించుకుంటూ డ్రైవింగ్ చేస్తూనే జరుగుతున్న సీన్ వివరించింది. ఆ క్రమంలో కూడా ఆ యువకుడు మరోసారి ఆమె కారును ఢీకొట్టాడు. చివరకు పోలీసులు శరవేగంగా వారిని సమీపించారు. అయితే, పోలీసుల నుంచి బయటపడేందుకు అతడు ప్రయత్నించి మరో వాహనానికి ఢీకొట్టి దొరికిపోయాడు. తనను చంపేందుకు అతడు చాలా ప్రయత్నాలు చేశాడని ఆమె పోలీసులకు వణికిపోతూ చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arizona  drunk driver  accident  crash  america  

Other Articles