వైజాగ్ టెస్ట్ లో కోహ్లీ షాకింగ్ డెసిషన్.. తొలివికెట్ డౌన్ | Team India bat first in Vizag test, Rahul loss early.

Lokesh rahul wicket lost early in vizag test

second test, India versus England, England versus India, Vizag test, Chandrababu Vizag test, India batting in Vizag, Vishakapatnam test

Team India Bat first in Vizag test, Rahul loss early in Stuart Broad bowling.

వైజాగ్ టెస్ట్ : తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

Posted: 11/17/2016 09:38 AM IST
Lokesh rahul wicket lost early in vizag test

ఇంగ్లాండ్ తో విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. రెండో ఓవర్లోనే రాహుల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్లో సువర్ట్ బ్రాడ్ వేసిన బంతితో రాహుల్ అవుటయ్యాడు. ప్రస్తుతం మురళి విజయ్, మరో ఎండ్ లో పుజారా ఉన్నారు.

ఇక కెప్టెన్ కోహ్లీ వ్యూహం మార్చి నిర్ణయం తీసుకున్నాడు. టాస్ గెలిచినప్పటికీ బ్యాటింగ్ ను ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు. పిచ్ పూర్తిగా ఎండిపోయినట్టున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసి, సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు.

కాగా, ఈ మ్యాచ్ లో ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసిన టీమిండియా కేఎల్ రాహుల్ ను తుది జట్టులోకి తీసుకుంది. మిశ్రా స్థానంలో జయంత్ యాదవ్ కు స్థానం లభించింది. దీంతో తన కెరీర్ లో తొలి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం యాదవ్ కు లభించినట్లయింది.

మ్యాచ్ ను తిలకించిన సీఎం చంద్రబాబు...

కాగా, రెండో టెస్ట్ ను తిలకించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చారు. ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం తొలిసారి ఓ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తోంది. దీంతో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రత్యేకంగా ఆహ్వానించింది.

టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా కలసి మ్యాచ్ తొలి రోజున స్టేడియంకు రావాల్సిందిగా కోరారు. దీంతో, ఎంతో బిజీగా ఉండి కూడా చంద్రబాబు విశాఖ క్రికెట్ స్టేడియంకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vizag Test  India  England  

Other Articles