ట్రంప్ ను లేపేస్తానన్న టెక్ సీఈవో... సారీ చెప్పినా వినలేదు | Tech CEO forced to resign after threatening to kill Donald Trump on Facebook.

Facebook threat to kill donald trump

Idiot CEO, kill Donald Trump, Donald Trump, Posts against Donald Trump, Facebook Donald Trump, Donald Trump CEO, PacketSled CEO, PacketSled Trump, Matt Harrigan

Idiot CEO threatens to kill Donald Trump on Facebook, gets fired for it.

ఇడియట్ సీఈవో ఉద్యోగం ఊడింది

Posted: 11/17/2016 08:04 AM IST
Facebook threat to kill donald trump

అగ్రరాజ్యం కిరీటం దక్కించుకోవటం మాట ఏమోగానీ, ఆయనంటే మండిపడేవాళ్ల సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ని అధ్య‌క్షుడిగా అంగీక‌రించేది లేదంటూ చాలా రాష్ట్రాల ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి ఎక్కి నిర‌స‌న గ‌ళం వినిపిస్తున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ట్రంప్ ప్రచార సమయంలోనే పిచ్చి వ్యాఖ్యలు చేశాడని, అలాంటోడిని గద్దె మీద కూర్చోబెడితే దేశం సర్వనాశనం అయిపోతుందని భావిస్తున్నారు.

తాజాగా అమెరికాలోని ప్యాకెట్‌స్లెడ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో మాథ్యూ హారిగ‌న్‌కు కూడా ట్రంప్ అంటే న‌చ్చ‌లేదు. అంతే ఆయ‌న‌ను చంపేస్తానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. అదికాస్తా వైర‌ల్‌గా మార‌డంతో కంపెనీ యాజ‌మాన్యానికి వ‌ణుకు మొద‌లైంది. అది త‌మ మెడ‌కు ఎక్క‌డ చుట్టుకుంటుందోన‌ని భ‌య‌ప‌డిన సదరు సంస్థ మాథ్యూ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉన్నార‌ని, ఆయ‌న పోస్టుతో సంస్థ‌కు ఎటువంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించింది.

సంస్థ ప్ర‌క‌ట‌న‌తో త‌ప్పు తెలుసుకున్న మాథ్యూ.. తాను స‌ర‌దాగా జోక్ చేశాన‌ని, త‌న గురించి తెలిసిన వారెవ‌రూ తాన‌లాంటి ప‌నిచేస్తాన‌ని అనుకోర‌ని పేర్కొన్నాడు. త‌ప్పుగా అనిపిస్తే క్ష‌మించాలంటూ ఫేస్‌బుక్‌లో మ‌రో పోస్టు చేశాడు. ఆయ‌న పోస్టును సీరియ‌స్‌గా తీసుకున్న సంస్థ అత‌డి పోస్టును సంస్థ వెబ్‌సైట్ నుంచి తొల‌గించ‌డ‌డ‌మే కాకుండా అత‌డిని ఉద్యోగం నుంచి తొల‌గించింది. ఇడియట్ సీఈవో యాష్ టాగ్ తో ప్రస్తుతం ఈ వార్త అక్కడ వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Matt Harrigan  PacketSled CEO  Donald Trump  

Other Articles