గన్ పిచ్చితో మాతాజీ కాల్పులు.. ఏం జరిగిందో చూడండి | Godwoman On Shooting Spree At Wedding Kills Groom's Aunt.

Godwoman gun loving kills groom s aunt

Karnal town firing, Sadhvi Deva Thakur, godwoman firing, Gun Loving culture, godwoman in marriage, Guns in Marriage, Gun Firing in Marriage, haryana godwoman, Groom's aunt died

A self-proclaimed godwoman Sadhvi Deva Thakur and her private guards went on a shooting spree at a wedding in Haryana's Karnal town on Tuesday, allegedly killing the groom's aunt and leaving three of his relatives critically wounded.

ITEMVIDEOS:పెళ్లిలో మాతాజీ కాల్పులు.. ఒకరి మృతి

Posted: 11/16/2016 10:50 AM IST
Godwoman gun loving kills groom s aunt

తనను తాను దైవంగా ప్రకటించుకున్న ఓ ఆధ్యాత్మిక గురువు గన్ పిచ్చితో ఓ పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఓవైపు వివాహ వేడుక జరుగుతున్న సమయంలో అతిథిగా హాజరైన ఆమె రెచ్చిపోయి కాల్పులు జరిపింది. అది కాస్త గురితప్పటంతో పెళ్లికొడుకు తరపు బంధువు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

హర్యానాలోని కార్నల్ లో జరిగిన ఈ ఉదంతం వివరాళ్లోకి వెళ్లితే... సాధ్వీ దేవ ఠాకూర్ అనే మహిళ పేరుకు మాతాజీ అయినప్పటికీ, కాషాయం దుస్తులు, బంగారు ఆభరణాలతో మంచి లైఫ్ స్టైల్ నే అనుభవిస్తోంది. ఇక ఏ పెళ్లికి అయినా ముఖ్య అతిథిగా హాజరవటం ఆమెకు అలవాటు. ఆమె హాజరయ్యిందన్న విషయం తెలుసుకున్న కొందరు ఆమె చుట్టూ చేరి ఆమెకు ఓ తుపాకీ ఇచ్చి, గాల్లోకి కాల్పులు చేయటం ప్రారంభించారు. అయితే గన్ గురితప్పటంతో స్టేజీపై డాన్సులు చేస్తున్న పెళ్లి బృందం వైపు తుటాలు దూసుకెళ్లాయి.

 

పెళ్లికొడుకు అత్త అక్కడికక్కడే కుప్పకూలిపోగా, మరో ముగ్గురు బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భయంతో తన అనుచరులతో సాధ్వీ అక్కడి నుంచి ఉడాయించింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, హత్యా నేరం కింద వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ సొంత నియోజకవర్గం కర్నాల్ కావటంతో ఈ ఘటన అక్కడి మీడియాలో టాప్ స్టోరీగా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : godwoman  Sadhvi Deva Thakur  Misfire  Wedding  Groom's aunt died  

Other Articles