ఆయన ఒక హీరో.. మంచి సందేశాత్మక చిత్రాలను ప్రజలకు అందించేందుకు తన వంతుగా ఎంతవరకైన కష్టపడి తన అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే హీరోగా నటిస్తే మాత్రమే సరిపోదు.. ఆలా తమ తీరును కూడా మార్చుకోవాలి.. సినిమాల్లో అడపడచులకు అండగా నిలవడం కాదు.. నిజజీవితంలోనూ అలానే వుండాలని ఆయనకు అభిమానులు సూచిస్తున్నారు. ఎందకంటే.. ఆయన హీరోగా కోనసాగుతూ.. విలన్ లా వ్యవహరించారు. ఆటపడచులకు అండగా నిలవాల్సిన వాడు.. నిర్మాత తమ్ముడికి వంతపాడుతూ దాడులకు పాల్పడినందుకు.
మాస్తిగుడి చిత్రం షూటింగ్ లో నెలకోన్న విషాధ సంఘటనను నుంచి తృటితో తప్పించుకుని.. తన అదృష్టవశాత్తు కలసివచ్చిన పునర్జన్మలో కూడా హీరో విలన్ లా వ్యవహరించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ హీరో ఎవరో అర్థమైంది కదూ. ఆయన మరెవరో కాదు కన్నడ హీరో దునియా విజయ్. మస్తిగుడి చిత్రం షూటింగ్ లో తన సహచరులైన ఇద్దరు నటులను కోల్పయిన విషాదం ఆయనలో ఏ మాత్రం కనిపించలేదు. అందుకేనేమో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నాడు.
మాస్తిగుడి విషాదఘటనలో చిత్ర నిర్మాత సుందర్ పీ.గౌడను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. కాగా సుందర్ గౌడ సోదరుడు శంకర్ తన భార్యపై గృహహింసకు పాల్పడుతున్నాడని, అదనపు కట్నం కోసం వేదిస్తున్నాడని బాధితురాలి తల్లి యశోధా అరోపించారు. అప్పటి నుంచి తమ కుమార్తెను చూడటానికి కూడా తమ ఇంటికి పంపించవాడు కాదని చెప్పారు.
ఈ నేపథ్యంలో తమ బిడ్డను చూసేందుకు బాధితురాలి తండ్రి జయరామ్ శంకర్ ఇంటికి వెళ్లగా.. అదనపు కట్నం కోసం నిలదీసి గోడపడ్డాడని.. అంతటితో ఆగకుండా హీరో దునియా విజయ్ను ఇంటికి పిలిపించి ఇద్దరు కలసి తన భర్తపై దాడికి పాల్పడ్డారని జయరామ్ భార్య యశోదా ఆరోపించారు. ఈ మేరకు అమె చెన్నమ్మనకెరె అచ్చుకట్టు కెరె పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
హీరో దునియా విజయ్ తన భర్త జయరామ్‌ను ఛాతిభాగంలో బలంగా కొట్టడంతో ఎముకలు విరిగాయని, ప్రస్తుతం ఆయన శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని యశోదా తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దునియా విజయ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తర్వాత బెయిల్ పై అతడికి విడిచిపెట్టారు. నిర్మాత సోదరుడి రుణం తీర్చుకునేందుకు హీరో ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడో ఏమో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం ఇలాంటి చర్యలను స్వాగతించడం లేదు. నిర్మాత సోదరుడి కుటుంబానికి సంబంధిచిన అంశంలో జోక్యం చేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more