2019లో అనంత నుంచి పవన్ పోటీ.. Pawan Kalyan to contest from Anantapur

Pawan kalyan to contest from anantapur

Jana Sena Party, Pawan Kalyan, Special Category Status to Andhra Pradesh,​ AP special status, Andhra pradesh special status, Ap political news, JSP, TDP., BJP, power star pawan kalyan, PK janasena, janasena ananthapur

Jana Sena Party supremo Pawan Kalyan to contest from anathapur in 2019 elections

2019లో అనంత నుంచి పవన్ పోటీ..

Posted: 11/10/2016 04:46 PM IST
Pawan kalyan to contest from anantapur

అనంతపురం అంటే అమితమైన ఇష్టం ప్రమే అని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాన్ రాష్ట్రంలో తొలిసారిగా తన తొలి కార్యాలయాన్ని అనంతపురం జిల్లాలోనే ప్రారంభిస్తున్నట్లు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణులు, అభిమానులు కేరింతలు కోడుతుండగానే వారి కరతాళ ధ్వనుల మధ్యే తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

తాను వెనుకబడిన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్దమని చెప్పారు. గెలుస్తానో లేదో అది తరువాత చూద్దమన్నారు. ‘‘నేను మీ కోసం పోరాడుతున్నాను.. అందుకనే ఇక్కడి నుంచి పోటీకి సిద్దమయ్యాను.. జిల్లాలో వేళ్లూనుకున్న కరువు ఇక్కడి నుంచి.. ఎందుకు తరమలేమో చూద్దాం.. మీరు నాకు అండ‌గా ఉన్నా లేక‌పోయినా నేను మీకు అండ‌గా ఉంటాను’’ అని ప‌వ‌న్ అన్నారు.

‘ఏ ప్రాంతంలో ఏ కులంలో పుట్టానో నేను ప‌ట్టించుకోను. కులాలు, మ‌తాల‌కు అతీతంగా నేను పోరాటం చేస్తానన్నారు. అనంతపురం జిల్లాలో కరువుకు రెండు కారణాలని ఆయన చెప్పారు. ఒకటి ప్రకృతి శాపం వల్ల జరిగితే రెండవ కారణం మన నాయకులేనని అయన చెప్పారు. మన ప్రాంతంలో పుట్టి మనకు న్యాయం చేయలేని రాజకీయ నాయకులు అనంతపురం జిల్లా పాలిట కరువుకు కారణమయ్యారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  anathapur  JSP  TDP  BJP  Congress  

Other Articles