ప్యాకేజీ వల్ల ఒరిగిందేమీ లేదు: పవన్ Pawan Kalyan says no use of Special Package to Andhra pradesh

Pawan kalyan says no use of special package to andhra pradesh

Jana Sena Party, Pawan Kalyan, Special Category Status to Andhra Pradesh,​ AP special status, Andhra pradesh special status, Ap political news, JSP, TDP., BJP, power star pawan kalyan, PK janasena, janasena ananthapur

Jana Sena Party supremo Pawan Kalyan on his relentless campaign for Andhra Pradesh Special Status speech at anathapur says no use of special package to AP

ప్యాకేజీ వల్ల ఒరిగిందేమీ లేదు..: పవన్

Posted: 11/10/2016 03:37 PM IST
Pawan kalyan says no use of special package to andhra pradesh

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అనేక హామాలను గుప్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందలమెక్కిన తరవాత వాటిని మర్చిపోయాయాని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు.. మనకు రావాల్సిన నిధులనే మనకు మళ్లించి అదేదో ఘనగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంట్లో అలికి బోజనం పెట్టి.. ఊరికి ఉపకారం చేసినట్లు చెప్పుకుంటున్న కేంద్రం.. దానికి వంతపాట పాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలను పవన్ తూర్పారబట్టారు.

ప్రత్యేక ప్యాకేజీ అద్భుతమని చెప్పిన వారు వున్నారని.. చట్టబద్దత లేని ప్యాకేజీకి సన్మాలు చేయించుకున్న వారు వున్నారని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తాం.. ఇస్తామన్న నేతలు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటే ముగిసిన అధ్యయం, మంత్ర దండం కాదని అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే తాము పయనించి ప్రజలను మోసం చేస్తామని చెప్పడం సబబు కాదని అన్నారు. మీకు హోదా ముగిసిన అధ్యాయం కావచ్చు కానీ  కరువు కోరల్లో చికుక్కున్న అనంతపురం జిల్లావాసులకు ప్రత్యేక హోదా అన్నది ఒక వరం లాంటిదన్నారు.

అనంతపురం సభలో తన ప్రసంగానికి ముందు సరిహద్దులో భారత సరిహద్దుల్లో దేశ రక్షణలో ప్రాణాలోడ్డి అమరులైన సైనికుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా తనకు ప్రత్యేక హోదా విషయలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో తాను ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియడం లేదని అన్నారు. తాను గతంలో అనంతపురానికి వచ్చానని, అప్పట్లో తాను రెండు పార్టీల తరుపున ఓటు వేయమని చెప్పాన్నారు. ఒకసారి ప్రజారాజ్యం పార్టీకి, మరోసారి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ తాను అనంతకు వచ్చానన్నారు. అనంతపురం అంటే తనకు చాలా ఇష్టం, ప్రేమ అని అన్నారు.

సమస్యలు వస్తే వెనకడుగు వేసే వ్యక్తి కాదు.. ధైర్యంగా ఎదురునిలిచి ఎదుర్కోంటానని చెప్పారు. పార్లమెంటు తలుపులు మూసి బిల్లులను అమోదించుకోవచ్చునని.. అందలం ఎక్కిన తరువాత హామీలను మర్చిపోవచ్చునని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను కూడా విస్మరిస్తారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన వారికి.. హామీలను నెరవేర్చాని వారకిి మధ్య తేడా ఏమీ లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ విషయంలో అర్థరాత్రి హైడ్రామా తరువాత ప్రకటించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  anathapur  JSP  TDP  BJP  Congress  

Other Articles