టీడీపీ అవినీతి... జగన్ టాపిక్ కూడా లేవనెత్తాడు | Pawan kalyan about TDP corruption

Pawan kalyan about tdp corruption

Pawan Kalyan, Janasena Chief, Pawan TDP corruption, Janasena on corruption, Pawan Kalyan jagan mohan reddy, Pawan Jagan, Seemandhra Hakkula Chaitanya Sabha, Pawan Ananthapuram

Pawan kalyan about TDP corruption, and YSRCP Jagan names in Anantha Seemandhra Hakkula Sabha.

టీడీపీ అవినీతి.. అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు

Posted: 11/10/2016 05:29 PM IST
Pawan kalyan about tdp corruption

ఏపీ అదికార పక్షం టీడీపీపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా విమర్శలు కురిపించారు. ఉత్తరాంధ్ర, టీడీపీ ప్రజలు ఎందుకు దూరమౌతున్నారో అధికార పక్షం గుర్తించాలని అనంత సభలో జనసేన అధినేత ప్రశ్నించాడు. లేదంటే మరో ప్రాంతీయ ఉద్యమం వస్తుందని హెచ్చరించాడు. ఆదిలోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాలకు సూచించాడు. జనసేన ఆఫీస్ తో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడటం, గెలవటం అన్న విషయాన్ని పక్కన బెట్టి ఇక్కడి సమస్యలను ఢిల్లీకి చేరవేస్తానని, కదిలి వస్తే వచ్చేవారిని తనతోపాటు తీసుకెళ్తానని పవన్ చెప్పుకొచ్చాడు.

దొపిడీ వ్యవస్థకు పూర్తి విరుద్ధం జనసేన అని చెప్పిన పవన్, డబ్బుతో కూడిన రాజకీయాలంటే అసహ్యం అని చెప్పుకొచ్చాడు. దేశంలోనే కరువు ప్రాంతంగా మిగిలిపోయిన అనంతపురం నుంచే పోరాటంకి శ్రీకారం చుడతానని, దానికి అందరి సహకారం కావాలని టీడీపీలో పొలిటికల్ కరప్షన్ ఎక్కువైందన్న ఆరోపణల గురించి ప్రస్తావించిన పవన్, అభివృద్ధి అంటే సింగపూర్ తరహా హంగులు కాదని, పాలన పరంగా డెవలప్ మెంట్ ఉండాలంటూ విరుచుకుపడ్డాడు.

ప్రజలందరితో ఉన్నామని చెప్పాల్సిన ప్రభుత్వంపై ఈ ఆరోపణలు ఎందుకు? వస్తున్నాయో ఆత్మపరిశీలన చేసుకోండి. బంధుప్రీతి, మద్దతుదారుల ప్రీతి వదిలెయ్యండి. ప్రజలకు అండగా నిలవండి. అమరావతి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వేరైపోయినట్టు ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి విభజన రాకుండా జాగ్రత్తపడండి. రాజధాని కేవలం డబ్బున్నవారికి మాత్రమేనా? లేక రాష్ట్ర ప్రజలందరిదీనా? రాజధాని ఎలా ఉండబోతోంది. మరోసారి ప్రజలందరికీ రాజధాని ఎలా ఉంటుందో చెప్పండి.

క‌ర‌వు వ‌ల్ల ఆంధ్ర‌పడుచులు మానాలు అమ్ముకుంటున్నారు మీకు తెలుసా? అని ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించాడు. ఇక్క‌డ భూమి ఉండి కేవ‌లం నీరులేక ఆత్మ‌గౌర‌వం అమ్ముకొని బతుకుతున్నారు. మ‌మ్మ‌ల్ని ర‌క్షించేవారు ఎవ‌రూ లేర‌ని వారు ఆవేద‌న చెందుతున్నారు’ అని పవన్ అన్నాడు. దోపిడీ, మోసాలు ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు, జగన్ ఎవరైనా తనకు ఒక్కటేనని, అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదంటూ మండిపడ్డాడు.

‘నేను రైతు బిడ్డ‌నే.. నేనూ కూలి ప‌ని చేశాను... ప్ర‌భుత్వాలు త‌లుచుకుంటే అనంత‌పురాన్ని బాగు చేయ‌గ‌ల‌వు. స‌త్య‌సాయిబాబా చేసిన ప‌నిని ప్ర‌భుత్వాలు ఎందుకు చేయ‌వు? స‌్వ‌చ్ఛంద సంస్థ‌లు చేస్తోన్న ప‌నిని ప్ర‌భుత్వాలు ఎందుకు చేయ‌గ‌ల‌గ‌డం లేదు. ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి ఉంది. నాకు న‌టుడిగా ఆనంద‌ం లేదు. నాకు నిజ‌మైన ఆనందం క‌లిగేది ప్ర‌జ‌ల‌ స‌మ‌స్య‌ల‌పై పోరాడిన‌ప్పుడే. మీకు నేను అండ‌గా ఉంటాను.

చివర్లో కాస్త నిదానంగా మాట్లాడిన పవన్.. టీడీపీ అయినా, వైసీపీ అయినా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా అనంతపురం ను ఓటు బ్యాంకుగా కాకుండా, కరువు కోరల్లోంచి ఎలా బయటపడేయాలో ఆలోచన చేయడంటూ హితవు పలికాడు. కల్లూరి, లోక్ నాయక్ జయప్రకాశ్ లాంటి వారి స్పూర్తితో స్థాపించిన ఈ జనసేన పార్టీని మీ అందరి అండతో ముందుకు కొనసాగిస్తానంటూ జై హింద్ అంటూ ముగించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jagan Mohan Reddy  Seemandhera Hakkula Chaitanya Sabha  

Other Articles