శబరిమలై విషయంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం | Kerala govt nod for women entry into sabarimala temple

Kerala govt nod for women entry into sabarimala temple

Kerala Sabarimala temple women, Kerala government Sabarimala Women, Women allow Sabari temple, Sabarimala temple women, Kerala govt to supreme about sabari temple, Sabarimala temple culture, All age women allow Sabari temple

Women of all age groups should be allowed in the famous Sabarimala shrine of Kerala, the state government today told the Supreme Court.

శబరి గుళ్లోకి ఆడాళ్ల ప్రవేశంకు గ్రీన్ సిగ్నల్

Posted: 11/07/2016 03:22 PM IST
Kerala govt nod for women entry into sabarimala temple

కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలైలోకి మహిళల ప్రవేశానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అయ్యప్ప స్వామి గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

గత కొన్ని శతాబ్దాలుగా 10 నుంచి 50 ఏళ్ళ లోపు మహిళలు గుళ్లోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు. ముఖ్యంగా రుతుస్రావం సమస్య కారణంగా ఆలయం అపవిత్రమైపోతుందన్న కారణంగానే ఈ ఆనవాయితీ ఉందన్న వాదన ఓవైపు, స్వామి బ్రహ్మచారి కాబట్టే ఆడాళ్లకు ప్రవేశం లేదన్న మరో వాదన గట్టిగా వినిపించాయి. 2007 లో లెఫ్ట్-యూడీఎఫ్ ప్రభుత్వం అందుకు అభ్యంతరం చెప్పకపోగా, తర్వాత ఏర్పడిన కాంగ్రెస్-యూడీఎఫ్ ప్రభుత్వం అందుకు నిరాకరించింది.

అయితే ఇది ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘనే అవుతుందని సుప్రీం ఈ ఫిబ్రవరిలో స్పష్టం చేయటంతో, మళ్లీ అధికారంలోకి వచ్చి యూడీఎఫ్ ఆ నిబంధనను సవరిస్తూ మహిళలకు గర్భగుళ్లోకి నిరభ్యరంతంగా ప్రవేశించవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, గత కొన్నేళ్లుగా శబరిమల గుడిలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ మహిళా సంఘాలు ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం తాజా ప్రకటనతో మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆలయ ట్రస్ట్ బోర్డు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. గతేడాది బోర్డు చీఫ్ గోపాలకృష్ణన్ రుతుసమస్యలను గుర్తించే యంత్రం కనిపెట్టిన తర్వాతే మహిళలను లోపలికి అనుమతించాలంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారం రేపాడు. ఇక తాజా నిర్ణయంతో బోర్డు ఎలాంటి చర్యలకు దిగబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Sabarimala temple  women allow  

Other Articles