రాహుల్ అసలు సమస్య ఏంటసలు? | Rahul gandhi no for CWC President

Rahul gandhi no for cwc president

Rahul Gandhi again No for CWC, Sonia one more year for CWC, Rahul Gandhi no for CWC, CWC president, Congress Vice President Rahul Gandhi, rahul gandhi CWC meeting

After Rahul Gandhi no for CWC President, Sonia Gandhi to be Congress president for one more year.

రాహుల్ మళ్లీ అదే పని చేశాడు

Posted: 11/07/2016 04:54 PM IST
Rahul gandhi no for cwc president

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, నెంబర్ టూ పొజిషన్ లో ఉన్న రాహుల్ గాంధీ వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ, అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా కోరింది. ఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశంలో, రాహుల్ గాంధీ ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఉండాలంటూ విన్నవించింది.

అయితే, కీలకమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకోగా, ఎప్పట్లాగానే సీడబ్ల్యూసీ విన్నపాన్ని రాహుల్ తిరస్కరించారు. ప్రస్తుతం మన ప్రజాస్వామ్య దేశం మోదీ పాలనతో చీకట్లో ఉండిపోయిందని, ప్రతిపక్షం అడిగే ఒక్క ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని రాహుల్ ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఇక కీలక బాధ్యతలకు రాహుల్ మొగ్గు చూపకపోవటంతో మరో ఏడాది పాటు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగించాలని సీడబ్ల్యూసీ చివరకు తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని త్వరలోనే ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మరోవైపు, పార్టీ అధినేత్ర సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాలేదు.

కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పెద్దగా కోలుకోలేదు. పైగా అధికారం ఉన్న రాష్ట్రాలను ఒక్కోటిగా కోల్పోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్స్ గా భావిస్తోన్న యూపీ ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకం కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CWC Meeting  Rahul Gandhi  Congress President  

Other Articles