కిమ్ జంగ్ నే బకరాని చేసిన ఆ ఇద్దరు | North Korea demands apology from two Australian pranksters

North korea demands apology from two australian pranksters

Australian pranksters North Korea, Kim Jung North Korea pranksters, Pro Golfers north korea pranksters, North Korea Australian Golfers, Fake Golf Players Kim Jung

Two Australian pranksters Pose as Pro Golfers Bluffed Their Way to North Korea's Golf Tournament.

కొరియానే బురిడీ కొట్టించిన కంత్రిగాళ్లు...

Posted: 11/07/2016 12:29 PM IST
North korea demands apology from two australian pranksters

అగ్రరాజ్యం అమెరికాతోసహా ప్రపంచ దేశాలన్నింటినీ అణ్వాయుధ పరిక్షలతో గజగజలాడిస్తున్న నియంత కిమ్ జంగ్. తనకు గౌరవం ఇవ్వకపోయినా, ఎదురు తిరిగినా సరే ఎంతటి దారుణమైన శిక్షలు విధిస్తాడో గతంలో మనం చాలానే చూశాం. అంతటి భయంకర నియంత దేశంలో హల్ చల్ చేసిన ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.

ఉత్తర కొరియాలో ప్రతియేటా గోల్ఫ్ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు ఆస్ట్రేలియా కు చెందిన మోర్గాన్ రూగ్, ఇవన్ షే దరఖాస్తు చేసుకోగా, వారిని రమ్మని ఆహ్వానం వచ్చింది. దీంతో తప్పు చేస్తున్నామని తెలిసినా, ధైర్యంగా ఉత్తర కొరియాకు వెళ్లారు. విదేశీయులు ఎవరు ఉత్తర కొరియా వెళ్లినా అక్కడి అధికారులకు పాస్ పోర్టులు ఇవ్వాల్సిందే. అలాగే వీరూ ఇచ్చారు. అయితే, అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో వీరి పాస్ పోర్టుల వెరిఫికేషన్ జరగలేదు. మొత్తం 85 దేశాల క్రీడాకారులు పోటీలకు రాగా, గోల్ఫ్ రాని వీరు ఆటగాళ్ల మాదిరి నటించి స్కోర్ బోర్టులో చివరి స్థానంలో నిలిచారు.

ఐదు రోజుల పాటు పలు ప్రాంతాలను తిరిగి, క్షేమంగా ఆస్ట్రేలియాకు చేరుకుని ఆపై ఓ టీవీ ఛానెల్ కు హాజరై మరి తమ ఘనకార్యాన్ని బయటపెట్టారు. ప్రాంక్స్(Pranks) పేరిట ఈ ఇద్దరు చేసిన వ్యవహారంపై ఉత్తరకొరియా ను బకారా చేశారని అంతా నవ్వుకున్నారు. అయితే చిన్న నేరానికే కఠిన శిక్షలు ఉండే ఉత్తర కొరియాలో ఈ ఇద్దరు యువకులు బురిడీ కొట్టిస్తే సహిస్తుందా? అందుకే వెంటనే వారు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian Pranksters  North Korea  Golf Players  

Other Articles