జైలుశిక్షను ఉన్నత న్యాయస్థానంలో అపీలు చేస్తా: బాలీవుడ్ నటుడు Aditya Pancholi gets one year jail in 2005 assault case

Aditya pancholi gets 1 year in jail for 2005 assault case over parking

Aditya Pancholi, Mumbai, Andheri court, assaulting neighbour, parking slot, jail term, Bollywood actor, justice Amitabh Panchbhai, 1 Year Jail, sentence, pratheek, car parking, bollywood

The Andheri court hearing the case also slapped a fine of Rs 20,000 on the actor Aditya Pancholi. Magistrate Amitabh Panchbhai of Andheri court sentenced the actor to jail for one year

జైలుశిక్షను ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తా: బాలీవుడ్ నటుడు

Posted: 11/06/2016 10:54 AM IST
Aditya pancholi gets 1 year in jail for 2005 assault case over parking

బాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన నటులు ఒక్కోక్కరుగా న్యాయస్థానం మెట్లు ఎక్కుతున్నారు. కొందరు తాము చేసిన నేరాలకు గాను శిక్షను అనుభవించి.. కడిగిన ముత్యంలా బయటకు వస్తుండగా, మరికోందరు శిక్షల విధించబడటంతో కోర్టులకు ఆశ్రయిస్తున్నారు. ఈ జాబితాలో చేరిన మరో నటుడి పేరు ఆదిత్య పంచోలీ. గతంలో అదిత్య పంచోలి తన పక్కింటి వ్యక్తి నాసికంపై పిడిగుద్దు గుద్దడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తన ముక్కు ప్రాక్చర్ అయ్యిందని.. పంచోలీపై ఆయన పిర్యాదును దాఖలు చేశారు.

బాధిత వ్యక్తి ప్రతీక్ దాఖలు చేసిన పిర్యాదును విచారించిన న్యాయస్థానం 11 ఏళ్ల తరువాత పంచోలిని దోషిగా తేల్చింది. దీంతో ముంబైలోని అంధేరి న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది. అంధేరి మేజిస్ట్రేట్‌​ కోర్టు జస్టిస్ అమితాబ్ పంచ్ భాయ్ ఈ మేరకు తీర్పు చెప్పినట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు చెప్పారు. దీంతో పాటు న్యాయస్థానం అతనికి 20 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. కాగా న్యాయస్థానం 12 వేల రూపాయల సొంత పూచీకత్తుపై పంచోలీకి బెయిల్‌ మంజూరు చేసింది. అయితే శిక్ష అమలుకు నెల రోజుల సమాయాన్ని న్యాయస్థానం ఇచ్చింది. దీంతో కొర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పంచోలీ తాను అంధేరి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని చెప్పారు.

ఘర్షణకు కారణం కారు పార్కింగేనా..?

2005లో​ పంచోలీ నివాసముంటున్న అపార్టుమెంట్లలోనే ప్రతీక్ అద్దెకు దిగాడు. అయితే తనకు కేటాయించిన కారు పార్కింగ్ లో మరో వ్యక్తి కారు వుండటాన్ని గమనించి ఏకంగా ఆ కారుకు ఎదురుగా కారు పార్క చేశాడు ప్రతీక్, దీంతో తన కారుకు ఎదురుగా కారును ఎందుకు పార్కు చేస్తున్నావని పంచోలి స్నేహితుడితో కలసి పంచోలి కూడా నిలదీశారు. తనకు కేటాయించిన కారు పార్కింగ్ ఏరియాలో మీరు అనుమతి లేకుండా కారు పార్కింగ్ ఎలా చేశారని ప్రతీక్ కూడా ఎదురుదాడి చేశాడు. దీంతో పట్టలేని కోపంతో ఊగిపోయిన పంచోలి అతని ముక్కుపై ఒక్క పిడిగుద్దు ఇచ్చాడు. దీంతో ప్రతీక్‌ ముక్కు ఫ్రాక్చర్‌ అయ్యింది. ప్రతీక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు పంచోలీపై కేసు నమోదు చేశారు. 11 ఏళ్ల తర్వాత కోర్టు పంచోలీని దోషీగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood actor  Aditya Pancholi  1 Year Jail  andheri court  sentence  pratheek  car parking  bollywood  

Other Articles