బీజేపి నేత ఇంటి ఎదుట ‘న్యాయం కోసం’ కోడలి ధర్నా daughter in law stages protest in front of bjp leader's house

Daughter in law stages protest in front of bjp leader s house

domestic violence, harrassment, sujatha, ashok, living together, marriage, protest, BJP leader srinu, film nagar, banjara hills police station, bhagat singh colony, crime

daughter in law stages protest in front of bjp leader's house as his son thrown away of his house in pretext of second marriage

బీజేపి నేత ఇంటి ఎదుట ‘న్యాయం కోసం’ కోడలి ధర్నా

Posted: 11/06/2016 10:02 AM IST
Daughter in law stages protest in front of bjp leader s house

ఆయన ఒక బీజేపి నేత. అర్ఎస్ఎస్ భావజాలాన్ని అందిపుచ్చుకుని దేశభక్తి, మన సంస్కృతీ, సంప్రదాయం గురించి అవలీలగా చెప్పాస్తాడు. అయితే పండిత పుత్ర పరమ శుంఠ అన్న నానుడి ప్రభావమో లేక మరేటోగానీ.. ఈ నేత కుమార రత్నం మాత్రం తన తండ్రికి పూర్తి భిన్నంగా వున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులను కన్న తరువాత.. వదిలేసి మరో పెళ్లికి సిద్దమవుతున్నాడు. తనకు న్యాయం చేయాలని అతని భార్య పోరాటానికి దిగడంతో అమెను తాను పెళ్లి చేసుకోలేదని, పాశ్చాత సంస్కృతి మోజులో సహజీవనం చేశానని బుకాయిస్తున్నాడు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... ఫిలింనగర్ కు చెందిన సుజాత, భగత్ సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నేత ఎస్పీ శ్రీను కుమారుడు అశోక్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాష్ (9), ప్రదీప్ (1) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అశోక్ భార్యను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఆమె మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతోంది. గతంలో కూడా ఒకసారి అశోక్ ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టగా అత్తింటివారు న్యాయం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారిచ్చిన హామీ నెరవేరకపోవడంతో రెండువారాల క్రితం పోలీస్ స్టేషన్లో బైఠాయించగా మళ్లీ వంచించారని అరోపించింది.

దీంతో చేసేది లేక అత్తింటి ముందు తమ ఇద్దరు పిల్లలుతో కలిసి నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన ఆమెను భర్త అశోక్ అడ్డుకుని కొట్టి బయటకు తోసేయడంతో గాయపడింది. బాధితురాలి పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అశోక్ ను  అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ  తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని బాధితురాలు హెచ్చరించింది. మరో పెళ్ళి చేసుకోవడానికి తనను దూరం చేస్తూ అత్తమామలతో కలిసి వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. తాము పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : domestic violence  harrassment  sujatha  ashok  protest  BJP leader srinu  crime  

Other Articles