ఎన్టీటీవి ఇండియాకు జత కలసిన మరో రెండు ఛానళ్లు After NDTV, Govt Orders Two More Channels To Go Off Air

After ndtv govt orders two more channels to go off air

NDTV India,NDTV India Ban,ndtv india banned,Information and Broadcasting Ministry NDTV India,I&B ministry NDTV ban,News Time Assam ban,Inter Ministerial Committee,pathankot coverage

Alleged over blatant violation of norms the Information and Broadcasting Ministry on Sunday ordered two more news channels to go off air.

ఎన్టీటీవి ఇండియాకు జత కలసిన మరో రెండు ఛానళ్లు

Posted: 11/06/2016 11:36 AM IST
After ndtv govt orders two more channels to go off air

పరుధులు దాటిన టివీ ఛానెళ్లపై కేంద్రం కోరడా ఝుళింపిచడాన్ని అపడం లేదు. మాద్యమాలకు విధించిన నియమనిభంధనలు దాటి వ్వవహరించారన్న అభియోగాలతో ఇప్పటికే జాతీయ ఛానల్ ‘ఎన్డీటీవీ ఇండియా’ పై నిషేధం విధించడాన్ని విపక్షాలతో పాటు మాద్యమాల సంఘాలు, జర్నలిస్టులు తప్పుబడుతుండగానే కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసీ తమ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకునేది లేదని తేల్చిచెప్పినట్లైంది. ఇంతకీ కేంద్రం అడుగు ముందుకేసీ ఏం చేసిందంటరా..? ఎన్డీటీవి ఇండియాతో పాటు మరో రెండు ప్రాంతీయ చానళ్లపై కూడా వేటు వేసింది.

‘న్యూస్ టైం అస్సాం’ చానల్ పలుసార్లు మార్గదర్శకాలను ఉల్లంఘించి, క్షమాపణ కోరుతూ సవరణ ప్రసారం చేయమన్నా చేయలేదు. దీంతో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి 10 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ఆ చానల్ ప్రసారాలు నిలిపివేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. యజమాని చేతిలో దారుణ చిత్రహింసలకు గురైన పని పిల్లవాడి గుర్తింపు తెలిపేలా ఈ చానల్ ప్రసారాలు చేసి, అతని గౌరవానికి భంగం కలిగించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కాగా ఈ ఛానెల్ పై ఇప్పటికే నిబంధలను ఉల్లంఘించిందని, 2013లోనే దీనిపై నిషేధం విధించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో అప్పటి కేంద్ర ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పట్లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు కాలేదు. మరో ఉత్తర్వులో ‘కేర్ వరల్డ్ టీవీ’ అనే చానల్‌ను కూడా ప్రభుత్వం నిషేధించింది. అభ్యంతరకర దృశ్యాలను చూపించడంతో నవంబరు 9 నుంచి ఈ చానల్ ప్రసారాలను వారం రోజులపాటు నిషేధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDTV India  Central government  News Time Assam  care world tv  

Other Articles