5వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ పేర్లు | Tollywood names in big drug racket.

Tollywood hand in big drug racket

Tollywood names in India's biggest drug racket, India's biggest drug racket, Tollywood names in drug racket, tollywood involvment, drug racket tollywood, tollywood drug racket

Tollywood names in India's biggest drug racket.

బిగ్గెస్ట్ డ్రగ్ రాకెట్ లో టాలీవుడ్ పేర్లు?

Posted: 11/03/2016 01:17 PM IST
Tollywood hand in big drug racket

దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ రాకెట్‌ను బ‌య‌ట‌పెట్టారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు. మార్కెట్ విలువ దాదాపు 5వేల కోట్లు పైమాటే అని భావిస్తోన్న ఈ వ్యవహారంతో సంబంధమున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ సుభాష్ దుధానిని అదుపులోకి విచారిస్తున్న బీఎస్ఎఫ్ అధికారులను ఆశ్చర్యపరిచే ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ భారీ డ్రగ్ రాకెట్‌ నీలిమేఘాలు టాలీవుడ్ పైకి రాబోతున్నాయా? టాలీవుడ్ బడా బాబుల బాగోతాలు కూడా రచ్చకెక్కనున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ కు చెందిన కొందరు బడా నిర్మాతలు కూడా ఈ రాకెట్ లో నిండా మునిగి ఉన్నట్లు సుభాష్ వెల్లడించినట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు తెలుగు చిత్రసీమకు చెందిన కొందరు ప్రముఖులకు కూడా ఇందులో వాటా ఉందన్న విషయాన్ని బయటపెట్టాడని చెబుతున్నారు. మాదకద్రవ్యాల వ్యవహారంలో ఇండస్ట్రీకి సంబంధాలు ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని తెలిసిన వ్యవహారమే. ఇప్పటికే తెలుగు చిత్రసీమకు చెందిన కొందరు నిర్మాతలు, నటులకు డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్టు రుజువైన ఘటనలు కూడా ఈ వాదనను బలపరుస్తున్నాయి.

గతంలో కొందరు యువ హీరోలు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఇక అక్టోబర్ 2015లో ఒకసారి, తాజాగా నెలక్రితం మరోసారి నైజీరియన్ డ్రగ్ మాఫియాలో మనోళ్ల పాత్ర బయటపడింది. హైదరాబాద్ సైనిక్ పురిలో ఓ యువ నిర్మాతను దీనికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా వెలుగుచూసిన భారీ డ్రగ్ మాఫియాలో టాలీవుడ్ కు చెందిన చాలా పెద్ద తలకాయలు.. కొంతమంది రెస్టారెంట్ ఓనర్లు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అటు తిరిగి..ఇటు తిరిగి ఇది తెలుగు చిత్రసీమకు చెందిన బడాబాబుల మెడకు చుట్టుకుంటుందా అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

ఎలా బయటపడింది...

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన నిషేధిత నార్కోటిక్ ఉత్ప్రేర‌కాన్ని ఓ ఫ్యాక్ట‌రీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే సుభాష్ దుధానిని అరెస్ట్ చేశారు కూడా. అక్టోబ‌ర్ 28న మ‌రుధార్ డ్రింక్స్‌పై అధికారులు దాడి చేయ‌గా.. అందులో ఒక రూమ్ నిండా నిషేధిత మాండ్రాక్స్ టాబ్లెట్స్ క‌నిపించాయి. అందులో మొత్తం రెండు కోట్ల ట్యాబ్లెట్లు ఉండ‌గా.. వాటి బ‌రువు 23.5 మెట్రిక్ ట‌న్నుల‌ని, విలువ సుమారు రూ.3 వేల కోట్లు ఉంటుంద‌ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్ట‌మ్స్‌ (సీబీఈసీ) చైర్‌ప‌ర్స‌న్ న‌జీబ్ షా వెల్ల‌డించారు.

డీఆర్ఐ చ‌రిత్ర‌లో ఇంత‌పెద్ద డ్ర‌గ్స్ రాకెట్ ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. దీని వెన‌క ఉన్న సూత్ర‌ధారుల‌ను అరెస్ట్ చేశామ‌ని, ఈ రాకెట్‌లో పాలుపంచుకున్న అంద‌రినీ అరెస్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని న‌జీబ్ తెలిపారు. బీఎస్ఎఫ్ స‌హ‌కారంతో డీఆర్ఐ ఉద‌య్‌పూర్‌లోని ఈ డ్ర‌గ్స్ ఫ్యాక్ట‌రీపై దాడులు నిర్వహించింది. ఇక్క‌డ త‌యారవుతున్న ఈ మాండ్రాక్స్ మాత్ర‌లను మొజాంబిక్‌, సౌతాఫ్రికాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు న‌జీబ్ చెప్పారు. గ‌త ఐదేళ్ల‌లో డీఆర్ఐ 540 కిలోల హెరాయిన్‌, 7409 కిలోల ఎఫిడ్రైన్‌తో పాటు ఇత‌ర నార్కోటిక్స్‌ను, 10 ఫ్యాక్టరీలను సీజ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  biggest drug racket  tollywood names  

Other Articles