ఆర్కే మిస్సింగ్ సస్పెన్స్ కంటిన్యూస్ | petition on maoist leader RK adjourned two weeks

Habeas corpus petition on maoist leader rk adjourned two weeks

Habeas Corpus maoist RK, RK wife Sirisha, habeas corpus petition maoist top leader, AP govt on RK, RK not in AP police hands, Maoist top leader missing, RK missing mystery continues, Maoist top leader RK

High Court adjourned on habeas corpus petition which filed on maoist leader RK's wife.

ఆర్కే ఉన్నాడో.. లేడో... అప్పుడే తేలుతుందా?

Posted: 11/03/2016 12:43 PM IST
Habeas corpus petition on maoist leader rk adjourned two weeks

ఆంధ్రా ఒడిషా సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు పెద్ద ఎత్తున్న నష్టం వాటిల్లింది తెలిసిందే. సుమారు ముప్పై మంది చనిపోగా, గాయాలతో చాలా మంది అగ్రనేతలు తప్పించుకుని పోయారంటూ కథనాలు వినిపించాయి. ఇందులో మావో అగ్రనేత రామకృష్ణ ఉన్నాడా మరి? ఈ అంశంపై సస్పెన్స్ గత కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గురువారం సాక్ష్యాల కోసం ఆర్కే భార్య శిరీషకు రెండు వారాల గడుపు ఇచ్చింది.

ఆర్కే ఆచూకీ కోసం ఆయన బార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు కాసేపటి క్రితం విచారణ చేపట్టింది. ఆర్కేకు సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలని కోర్టు కోరగా, అసలు ఆర్కే తమ అదుపులోనే లేడంటూ ఏపీ పోలీసులు తెలిపారు. విశాఖ రూరల్ ఎస్పీ ఇచ్చిన నివేదికతో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ అడ్వోకేట్ జనరల్ తన వాదనను వినిపించాడు. తమ ఆధీనంలో ఉండి ఉంటే పెండింగ్ కేసుల దృష్ట్యా ఇప్పటికే కోర్టులో హాజరుపరిచేవారని ఆయన వివరించాడు.

దీనికి ప్రతిగా ఆధారాలు ఉన్నాయా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని బెంచ్ కోరింది. ఆర్కే పోలీసుల దగ్గర ఉన్నాడని ఆధారాలు చూపేందుకు 15 రోజుల సమయం కావాలని పిటిషననర్ కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ వాదనను అంగీకరించి తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.

మరోవైపు ఎన్ కౌంటర్ కి నిరసనగా ఐదు రాష్ట్రాల్లో ఈ రోజు మావోయిస్టులు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో మాత్రం బంద్ ప్రభావం పాక్షికంగా ఉన్నట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Habeas Corpus Petition  Maoist top leader  RK  wife sirisha  

Other Articles