ముసలావిడను చంపి మరీ పెళ్లికి రెడీ అయ్యాడు | groom arrested hours before marriage

Bride groom arrested hours before marriage

groom arrested hours before marriage, Indian Bride Groom Arrested, After Murder groom ready for marriage, Indian Bride Groom arrested, groom arrested hours before marriage

groom arrested hours before marriage for Murder of lady in Karnataka.

ఇంటి ఓనర్ ను చంపి మరీ పెళ్లి సందడి

Posted: 10/19/2016 08:04 AM IST
Bride groom arrested hours before marriage

కోలాహలంగా ఉన్న పెళ్లి పందిరిలోకి వెళ్లి యూ ఆర్ అండర్ అరెస్ట్ అంటూ పోలీసులు డైలాగులు కొట్టే సీన్లు చాలా పాత సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, ఇక్కడ అది నిజంగానే జరిగింది. మరికాసేపట్లో ఓ అమ్మాయి మెడలో పసుపు తాడు కాదు... అది ఉరితాడే అనుకోవాలేమో.. పడకుండా ఖాకీలు ఆపగలిగారు. కొద్ది నిమిషాల్లోనే ముహుర్తం అనుకుంటుండగా, అంతలోనే మంటపంలోకి వచ్చిన పోలీసులు ఏకంగా వరుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

చిక్ మంగళూర్ జిల్లా ముడిగర్ తాలుకా గోనిబీడు గ్రామానికి చెందిన ఓ యువతికి, సుబ్రహ్మణ్య తాలుకాకు చెందిన అరుణ్ (30) అనే యువకుడితో వివాహం నిశ్ఛయం చేశారు. ఈ నెల 16న జానాపుర కమ్యూనిటీ హాల్ లో వారి పెళ్లికి ముహుర్తం కూడా నిర్ణయించారు. శనివారం సాయంత్రమే ఆ పెళ్లి కొడుకు బంధుమిత్రులతో అక్కడికి చేరుకున్నాడు. ఉదయం పెళ్లి తంతు ప్రారంభమైంది కూడా. ఇంతలో పోలీసులు ఎంటర్ అయి అతగాడిని అదుపులోకి తీసుకున్నారు.

గతంలో బెంగళూరు నగరంలో కొంతకాలం ఉన్న అరుణ్ తాను అద్దెకు ఉండే ఆ ఇంటి యాజమానురాలిని ఆగస్టు 13న చంపేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతని అరెస్ట్ చేసినట్లు అక్కడున్న వారికి పోలీసులు వివరించారు. ఈ హఠాత్‌పరిణామంతో పెళ్లికి వచ్చిన పెద్దలు, బంధువులు ద్రిగ్భాంతికి గురయ్యారు. మరికొద్ది క్షణాల్లో తమ కూతురు మరో ఇంటిది అవుతుందన్న ఆనందంలో ఉన్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. అయితే కూతురు జీవితం నాశనం కాలేదు కదా అని బంధువులు సముదాయించటంతో పెళ్లి ఖర్చు వేస్టయ్యిందని ఫీలవుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bride Groom  Karnataka  arrested  before marriage  murder charge  

Other Articles