వెలగపూడి సెక్రటేరియట్ ప్రారంభం | navyandra secretariat Velagapudi starts

Navyandra secretariat velagapudi starts

AP secretariat, Velagapudi secretariat, AP CM chamber in Velagapudi, Velagapudi offices,

AP secretariat temporary starts in Velagapudi.

కేసీఆర్ కి బాబు సూటిగానే కౌంటర్

Posted: 10/12/2016 10:28 AM IST
Navyandra secretariat velagapudi starts

తెలుగు రాష్ట్రాల డెవలెప్ మెంట్ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి స్నేహం కొనసాగిస్తామని ప్రకటించిన ఇద్దరు చంద్రులు, విమర్శల విషయంలో మాత్రం వెనకడుగు వేయటం లేదు. నిన్న కొత్త జిల్లాల ప్రారంభం సందర్భంగా సిద్ధి పేటలో కేసీఆర్ మాట్లాడుతూ పక్క రాష్ట్రాలు అసూయ పడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తానని ప్రకటించి కొద్ది గంటలు గడవక ముందే ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా కౌంటర్ వేసేశాడు.

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక సచివాలయం బుధవారం ఉదయం ప్రారంభించారు. హైదరాబాద్ లో పదేళ్ల పాటు ఉండే హక్కు ఉన్నప్పటికీ, పాలన మన నేలపై నుంచి మాత్రమే సాగాలన్న ఉద్దేశంతో వేగంగా భవనాల నిర్మాణాలు సాగించినట్టు వెల్లడించారు. అభివృద్ధిని చూసి కొంతమంది అసూయ పడుతున్నారని, వారు చేసే విమర్శలను పట్టించుకోనవసరం లేదంటూ ఇండైరక్ట్ గా కామెంట్లు చేశాడు. 

ఇక తన చాంబర్ లోకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రవేశించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయ ఉద్యోగులు ఆయనకు శుభాకంక్షలు తెలిపారు. తన చాంబర్ లోని సీటులో కూర్చున్న అనంతరం డ్యాష్ బోర్డు ద్వారా ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, ఆపై పెండింగ్ లో ఉన్న డ్వాక్రా మహిళల రుణమాఫీ ఫైల్ పై సంతకం చేశారు. ఇకపై పాలన అమరావతి కేంద్రంగానే సాగుతుందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రెండో విడత పెట్టుబడి రాయితీల కింద రూ. 2,500 కోట్లు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు తెలియజేశారు. సీఎం వెంట చిన రాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, చీఫ్ సెక్రటరీ టక్కర్‌, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజధాని ప్రాంత రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM Chandrababu  temporary secretariat  starts  

Other Articles