జయలలిత అరోగ్యంపై వీడని సస్పెన్స్.. ఎయిమ్స్, విదేశీ వైద్యులతో చికిత్స.. AIIMS doctors to help in treatment of Jayalalithaa

Aiims doctors to help in treatment of jayalalithaa

Jayalalithaa, Jayalalithaa news, Jayalalithaa latest news, Jayalalithaa sickness, aiims, aiims doctors, Jayalalithaa checkup, tamil nadu AIADMK, jayalalithaa Health, Jayalalithaa, apollo hospital, chairman pratap reddy, Richard John Beale, States, Tamil Nadu

A three-member doctors team from All India Institute of Medical Sciences (AIIMS) will examine Tamil Nadu Chief Minister J Jayalalithaa admitted in Apollo Hospital since last month, said reports.

జయలలిత అరోగ్యంపై వీడని సస్పెన్స్.. ఎయిమ్స్, విదేశీ వైద్యులతో చికిత్స..

Posted: 10/06/2016 10:53 AM IST
Aiims doctors to help in treatment of jayalalithaa

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వైద్యులు అమె కోలుకుంటున్నారని, వైద్యానికి అమె శరీరం సహకరిస్తుందని చెబుతున్నా అన్నాడీఎంకే కార్యకర్తల్లో మాత్రం అమ్మ అరోగ్యంపై అందోళన వీడటం లేదు. తమ పురచ్చి తలైవీ పధిలంగానే వుందని, అమెకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు హెల్త్ బులెటిన్ల ద్వారా వెల్లడిస్తున్నా.. రోజులు గడుస్తున్న కోద్ది అమ్మ కోలుకునేందుకు ఇంకా ఎంతకాలం పడుతుందని అందోళన మాత్రం పార్టీ శ్రేణులు కలవరానికి గురిచేస్తుంది.
 
ఊపిరితిత్తుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ తో తీవ్ర అస్వస్థతకు గురైన జయలలితకు చికిత్స చేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి వచ్చిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ నాయక్‌, పల్మనాలజీ నిపుణుడు కిర్మాణీ, అనెస్థటిక్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ అంజన్‌ లు అమెకు చికిత్సను ప్రారంభించినట్లు సమాచారం. వీరితో పాటు ఇవాళ చెన్నై నగరానికి చేరుకున్న లండన్‌ వైద్యుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే కూడా వివిధ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

కాగా, జయలలిత వద్దకు అతికొద్ది మందికి మాత్రమే అనుమతి లభిస్తోంది. ఆమె మిత్రురాలు శశికళ, ఆమె మరదలు ఇళవరసి, శశికళ తమ్ముడు ఎంగిర దివాకరన్ లు జయలలిత బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం. కాగా, యాంటీ బయోటిక్స్ వాడుతున్న జయలలిత భారీ ఎత్తున బరువుతగ్గే అవకాశం ఉందని, డిశ్చార్జ్ అనంతరం రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఈ తరుణంలో అమె త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  jayalalithaa health  AIIMS doctors  Richard John Beale Tamil nadu  

Other Articles