కేజ్రీవాల్ ఆర్మీని కించపరచడం పచ్చి అబద్ధం | Manish Sisodia backs Arvind Kejriwal on surgical strikes

Manish sisodia backs arvind kejriwal on surgical strikes

Arvind Kejriwal Never Asked Said 'Proof' On Surgical Strikes, Kejriwal not insult Army, Sisodia backs Kejriwal, Kejriwal never make that comments, Kejriwal surgical strike comments

Arvind Kejriwal Never Asked Said 'Proof' On Surgical Strikes Delhi deputy CM Manish Sisodia backs Kejriwal.

అయితే కేజ్రీ అసలు అలా అనలేదా?

Posted: 10/06/2016 11:53 AM IST
Manish sisodia backs arvind kejriwal on surgical strikes

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైనికులు నిర్వహించిన సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై బహిరంగంగానే మండిపడుతున్నారు. మీడియా కూడా ఈ విషయంపై పుంఖానుపుంఖాలుగా వార్తలను ప్రచురిస్తోంది. అయితే, ఈ కథనాల్లో వాస్తవం ఏ మాత్రం లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు.

గోవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆధారాలు అన్న పదమే కేజ్రీవాల్ ఉపయోగించలేదని... పాక్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించాలని మాత్రమే కోరారని సిసోడియా తెలిపారు. సర్జికల్ దాడులకు సంబంధించి ప్రధాని మోదీని అభినందిస్తూ ఓ వీడియో సందేశాన్ని కూడా కేజ్రీవాల్ విడుదల చేశారని చెప్పారు.

మన సైనికులు ఎంతో ధైర్య సాహసాలతో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించారని... దేశ భద్రత కోసం సైనికులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టారని కేజ్రీవాల్ కొనియాడారే తప్ప, కించపరిచినట్లు ఎక్కడా వ్యాఖ్యానించలేదని తెలిపాడు. పాక్ మీడియాలో వచ్చిన పిచ్చి వార్తలను ఆధారంగా చేసుకుని బీజేపీ దీన్ని రాజకీయం చేస్తుందంటూ ఆరోపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kejriwal  surgical strike comments  Manish Sisodia  backs  

Other Articles