ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం.. Alert Soldiers Foil Attack On Kupwara Camp, Kill 3 Terrorists

Alert soldiers foil attack on kupwara camp kill 3 terrorists

Handwara, 30 RR, Rashriya rifles, Terror attack in Handwara, Langate, Jammu and Kashmir, Army camp attacked, 3 terrorists killed

Three terrorists, who attacked an Indian Army camp in Langate in Handwara in Jammu and Kashmir early today morning, have been killed. Massive search operations are going on.

హంద్వారాలో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం..

Posted: 10/06/2016 10:21 AM IST
Alert soldiers foil attack on kupwara camp kill 3 terrorists

భారత ఆర్మీ చేతిలో చావు దెబ్బ తిన్న తరువాత కూడా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇంకా బుద్ది రావడంలేదు. ప్రతీకారేచ్చతో రగిలిపోతూ అదును కోసం గుంటనక్కలా వేచి చూస్తున్న వారు ఇవాళ కాశ్మీర్ లోని హంద్వారాలో చొరబడ్డారు. అక్కడు వున్న రాష్ట్రీయ ఱైఫిల్స్ అర్మీ క్యాంప్ పై ఉద్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు, దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు వారికి ధీటుగా జవాబిచ్చారు. ఇప్పటికే పాకిస్థాన్ సరిహద్దులో ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో వున్నారని, వారు ఏ క్షణమైనా సరిహద్దును దాటవచ్చని హెచ్చరికల నేపథ్యంలో.. అత్యంత అప్రమత్తతో వున్న ఆర్మీ.. మెరుపు వేగంతో ఉద్రదాడులకు జవాబునిచ్చింది.

భారత సైన్యం నుంచి ఎదురైన హఠార్పరిణామంతో ఉగ్రవాదులు బతుకు జీవుడా అంటూ పరుగులు తీశారు. ప్రాణాలతో వుంటే చాలునని పలయాయనం చిత్తగించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోదామని భావించి, అడవుల్లోకి దూరాలని ప్రయత్నించారు. అయితే లాంగ్ గేట్ వద్ద వారిని అడ్డుకోగలిగిన జవాన్లను చూసి వారు కాల్పులు జరపగా, జవాన్లు కూడా ఎదరుకాల్పులకు జరిపారు. భారత జవాన్ల ముందు మనజాలని ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల శరీరాలను సైనికుల బుల్లెట్లు ఛిద్రం చేశాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles