ఈజిప్ట్ లో నరమేథం... 300 పౌరులను చంపిన పోలీసులు | Several Killed In Ethiopia After Protest Turns To Stampede

Several killed in ethiopia after protest turns to stampede

Ethiopia After Protest Turns To Stampede, Ethiopia Police Killed people, Ethiopia Police firing, Ethiopia Police kill, Ethiopia Police, Several Killed In Ethiopia After Protest Turns To Stampede, Oromiya region fest

Several Killed In Ethiopia After Protest Turns To Stampede.

పంగడ పూట కాల్పులు... 300 మంది మృతి?

Posted: 10/03/2016 08:48 AM IST
Several killed in ethiopia after protest turns to stampede

ఇథియోపియాలో పండగ పూట మారణకాండ చోటు చేసుకుంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఇరీచా వేడుకను సంబురంగా జరపుకుంటున్న ప్రజలపై పోలీసు బలగాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 300 మంది మృత్యవాత పడట్లు అనధికార సమాచారం. వందల్లో క్షతగాత్రులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం నిర్వహిస్తున్న ఒరోమో ప్రజలపై పోలీసులు హెలికాప్టర్ల నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఇక్కడి ఫెడరల్ ప్రభుత్వం వీరి హక్కులను కాలరాస్తుండడంతో ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. చాలాకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వీరిని దారుణంగా అణచివేస్తోంది.

ఇథియోపియోలోని పదికోట్ల మంది జనాభాలో అత్యధిక శాతం హోరా అర్సదీ ప్రావిన్సులోనే నివసిస్తారు. వర్షాకాలం ముగిసి వసంతకాలంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఒరోమో ప్రావిన్స్‌లో ఇరీచా అనే వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకుంటారు. ఓవైపు వేడుకలు జరుగుతండగానే ఈ దాడులు చోటు చేసుకోవటం విశేషం. రాజధాని అడిస్‌ అబాబాకు 40 కిలోమీటర్ల దూరంలోని బిష్పొతు నగరంలో ఇరీచా వేడుకలకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్రకటనలు చేస్తారన్న ఉద్దేశంతో శనివారం నుంచే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పూనుకుంది. అయినా ఆదివారం హోరా అర్సదీ వద్ద ఇరీచా వేడుకలు మొదలయ్యాయి. పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. నృత్యాలూ చేశారు. ఇదే సమయంలో పోలీసులు కాల్పులకు తెగబడ్డారు.

గత 11 నెలలుగా ప్రభుత్వ దమనకాండ పెచ్చుమీరడంతో వీరు నిరసను ఉద్ధృతం చేశారు. కాగా ఈ ఉత్సవంలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ప్రజలు నిరసన ప్రదర్శనలు చేస్తారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతారని భావించిన ప్రభుత్వం శనివారం నుంచే పెద్ద ఎత్తున అరెస్టులకు తెరలేపింది. ఆదివారం ఏకంగా కాల్పులకు తెగబడింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. దీనివల్లే ఎక్కుమంది చనిపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కాల్పుల విషయాన్ని అంగీకరించిన ఫెడరల్ ప్రభుత్వం మృతుల సంఖ్యను వెల్లడించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Several Killed  Ethiopia  Protest Turns To Stampede  

Other Articles