ఈ లోకంలో అమ్మ ప్రేమను మించింది మరోకటి లేదు. అందుకే మాతృత్వం దేవుడిచ్చిన వరంలా భావిస్తుంటారు. అందు కోసం ఎంతో మంది తల్లులు నోములు, పూజలు చేస్తారు.. కానీ, కన్నపేగు అన్న విషయాన్ని మరచి ఇప్పటి తల్లులు చేస్తున్న వ్యవహారాలు సమాజాన్ని విస్తూపోయేలా చేస్తున్నాయి. చిన్నతనంలో చితకబాదటం దగ్గరి నుంచి పెద్దయ్యాక వారిని వేశ్య గృహాలకు అమ్మటం లాంటి ఉదంతాలు ఈ మధ్య మనం చూశాం. తాజాగా ఓ ఇద్దరు తల్లుల నిర్వాకం వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి.
స్నానం చేయలేదని ఓ తల్లి కూతురిని చితకబాదిన ఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. జాఫ్నాకు చెందిన ఓ మహిళ తన కూతురిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని లాక్కొచ్చింది. చెవులు పిండుతూ అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. పెద్ద కర్ర తీసుకుని వీపుపై బాదింది. అయినా కూడా ఆమె కసి తీరలేదు.
పక్కనే ఉన్న పిల్లాడి చేతిలో కత్తి చూసింది. ఆ కత్తితో కూడా వీపుపై కొట్టి… తర్వాత జుట్టు పట్టుకుని ఈడ్చి నేలపై పడేసింది. తలకు షాంపు పెట్టి కసి తీరా రుద్దుతూ తన కోపాన్ని తీర్చుకుంది. ఈ వీడియోలో నెట్ లో అప్ లోడ్ కాగా, క్రూరత్వానికి నిదర్శనమంటూ ఆ తల్లి చేసిన పనిపై పలువురు మండిపడ్డారు. చివరకు చిన్నారిని హింసించిన ఆ తల్లిని కటకటాల వెనక్కి నెట్టారు.
ఇక మరో ఘటనలో మత్తుకు బానిసైన ఓ తల్లి లోకాన్ని పట్టించుకోకుండా పడిపోవటం, ఆ చిన్నారిని తల్లిని తడుతూ లేపేందుకు ప్రయత్నించడం పలువురిని కంట తడి పెట్టిస్తోంది. లారన్స్ అనే ప్రాంతంలో ఫేమిలీ డాలర్ స్టోర్ అనే సూపర్ మార్కెట్ ఉంది. 36 ఏళ్ల మహిళ తన రెండేళ్ల బిడ్డతో ఆ స్టోర్ కి వచ్చింది. ఆమెకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసింది. అనంతరం ఉన్నపళంగా కుప్పకూలిపోయింది.
అయితే ఆమె తీసుకున్న డ్రగ్స్ కారణంగా ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఇక తల్లి అలా పడిఉండటం చూసి ఆ రెండేళ్ల కూతురు, తల్లిని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఓ వైపు ఏడూస్తూనే తల్లిని లేపే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు అక్కడున్న కొందరు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి, బంధువులకు చిన్నారిని అప్పజెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more