కాంగ్రెస్ యువనేతలు కుక్కలను అతిదారుణంగా... | Kerala politicians parade with dead dogs on a pole to protest against strays

Kerala politicians parade with dead dogs on a pole to protest against strays

Kerala Congress Youth Leaders Dogs, Dogs Parade in Kerala, Kerala Congress leaders Dog Parade, Congress leaders kill dogs, Killed Dogs in Protest, Kerala Congress Rally, Dead Dog Rally in Kerala, against strays Congress kills Dogs

Kerala Congress Youth Wing leaders parade with dead dogs on a pole to protest against strays.

కాంగ్రెస్ నేతలు కుక్కలను అతిదారుణంగా...

Posted: 09/27/2016 01:13 PM IST
Kerala politicians parade with dead dogs on a pole to protest against strays

మనుషులమనే స్పృహ లేకుండా విచక్షణ మరిచిపోయి, వారు చేసిన పనికి చీత్కారాలు పడుతున్నాయి. కేర‌ళ రాష్ట్ర‌ కాంగ్రెస్‌(ఎం) యూత్‌ వింగ్ కొట్టాయం జిల్లాలో ఇటీవ‌ల ఓ ర్యాలీ వివాదాస్ప‌దంగా మారింది. దీనిపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... వీధికుక్కలు మనుషులపై విరుచుకుపడుతుండటంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అయితే అంతదాకా బాగానే ఉన్న వారు చేసిన పని మరీ ఘోరంగా ఉంది.

రాష్ట్రంలో కుక్కలు మ‌నుషుల‌పై చేస్తోన్న‌ దాడులు ఎక్కువవుతున్నాయంటూ, ప్ర‌భుత్వం ఏ మాత్రం పట్టించుకోవ‌డం లేదంటూ ఐదు శునకాలను చంపేసిన కార్య‌క‌ర్త‌లు అనంత‌రం వాటి మృతదేహాలను కట్టెకు వేలాడదీసి ప‌లు వీధుల్లో ర్యాలీలు తీశారు. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న ముగిశాక‌ స్థానిక పోస్టాఫీస్‌ ముందు వాటి మృతదేహాలను వదిలేసి వెళ్లిపోయారు. కేంద్ర రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు త‌మ తీరుని మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు.

ఆ కుక్కలను తామే చంపేశామ‌ని, కుక్క‌లు చేస్తోన్న‌ దాడులపై ప్ర‌భుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలే మ‌ళ్లీ జ‌రుగుతాయ‌ని వారు హెచ్చరిక‌లు జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై స్థానిక‌ పోలీసులు, ప్రభుత్వం స్పందించక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కుక్క‌ల‌ను చంపేసిన వారిపై కేసులు నమోదు చేయలేదు. కొన్ని రోజుల క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వీధికుక్కలను చంపితున్న ఘటనలపై స్పందిస్తూ అటువంటి చర్యలకు పాల్పడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. సీఎం ఈ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే ఆందోళ‌నకారులు ఈ చ‌ర్య‌కు పాల్పడటం గమనార్హం.

Kerala Congress kill Dogs

Congress rally Dogs

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Congress  Leaders  Kill  Dogs  

Other Articles