పారా ఒలంపిక్స్ లో వరల్డ్ రికార్డుతో భారత్ కు స్వర్ణం | Devendra Jhajharia wins gold at Rio Paralympics

Devendra jhajharia wins gold at rio paralympics

Devendra Jhajharia wins gold at Rio, second gold for India in Rio, Devendra Jhajharia history, Devendra Jhajharia Rajasthan, Devendra Jhajharia records, Devendra Jhajharia second gold

Devendra Jhajharia wins gold at Rio Paralympics in Javelin Throw.

రియో ఒలంపిక్స్ లో భారత్ కు రెండో స్వర్ణం

Posted: 09/14/2016 09:05 AM IST
Devendra jhajharia wins gold at rio paralympics

అవయవాలు సక్రమంగా ఉన్న ఆటగాళ్లు సాధించలేని ఘనతను దివ్యాంగులు సాధించి దేశ పరువు ప్రతిష్ఠలు ఇనుమడింపజేస్తున్నారు. రియో లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో నాలుగు రోజుల క్రితం తమిళనాడుకు చెందిన మరియప్పన్ హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. తాజాగా జావెలిన్ త్రోలో రాజస్థాన్ కు చెందిన దేవేంద్ర ఝుఝురియాకు స్వర్ణ పతకం వచ్చింది.

63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరిన ఝుఝురియా ఇప్పటి వరకు జావెలిన్ త్రోలో భారత ఆటగాళ్లు ఎవరూ చేయలేని ప్రదర్శనను చేయడం విశేషం. కాగా, ఈ పతకంతో రియో పారా ఒలింపిక్స్ లో రెండు స్వర్ణాలు సాధించిన ఏకైక భారతీయుడిగా దేవేంద్ర సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2004 ఏథెన్స్ ఒలంపిక్స్ లో కూడా అతను స్వర్ణం సాధించాడు. అంతేకాదు ఆ ఒలంపిక్స్ సమయంలో అత్యధిక దూరం విసిరిన రికార్డును నెలకొల్పిన దేవేంద్ర (62.15 మీటర్లు) ఆ రికార్డును ఇప్పుడు తానే బద్ధలు కొట్టేశాడు.

ఇక ఇప్పటిదాకా భారత్ మొత్తం నాలుగు పతకాలు సాధించినట్లు అయ్యింది. హైజంప్ విభాగంలో మరియప్పన్‌ తంగవేలు పసిడి పతకాన్ని గెలుచుకోగా.. వరుణ్‌ సింగ్‌ భటి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. జావెలిన్ త్రో విభాగంలోనే దీపా మాలిక్(46) రజతం సాధించిన విషయం తెలిసిందే.

Devendra Jhajharia Javelin throw

Devendra Jhajharia world record

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devendra Jhajharia  Rio  Paralympics 2016  Gold Medal  

Other Articles