ఏపీ గవర్నర్ గా మోత్కుపల్లి | Motkupalli Narasimhulu becomes Arunachal Pradesh Governor.

Motkupalli narasimhulu become arunachal pradesh governor

Motkupalli Narasimhulu Governor, Motkupalli Narasimhulu AP Governor, Motkupalli Narasimhulu Governor, Motkupalli Narasimhulu Arunachal Pradesh Governor, TTDP leader in AP governor race

TTDP leader Motkupalli Narasimhulu becomes Arunachal Pradesh Governor.

మోత్కుపల్లికి కోసం ఓ తీపి కబురు

Posted: 09/14/2016 10:03 AM IST
Motkupalli narasimhulu become arunachal pradesh governor

గవర్నర్ పదవి మీద ఆశలు పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆశాభంగం జరగటంతో నిరాశలోకి కూరుకుపోయిన మోత్కుపల్లి చిరకాల వాంఛ నెరబోరుతుందా? అంటే టీడీపీ శ్రేణులు అవుననే సమాధానమిస్తున్నాయి. ఖాళీగా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ పోస్ట్ ఆయన్ను వరించబోతుందనే సంకేతాలు బలంగానే అందుతున్నాయి. ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఓ గవర్నర్ పదవి ఇస్తానని ప్రధాని మోదీ హామీ మేరకు ఆయనకు ఈ పదవి దక్కనుందట.

నిజానికి మోత్కుపల్లి ఎప్పుడో గవర్నర్ కావాల్సి ఉంది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లాతో పాటు నలుగురిని గవర్నర్లుగా నియమించినా ఈ టీటీడీపీ సీనియర్ నేతకు మాత్రం మొండి చెయ్యిచూపించారు. దీంతో తాను గవర్నర్ అవుతానని ఓపెన్ గా ప్రకటించేసిన ఆయన అవమానంగా ఫీలయ్యారు. కొద్దిరోజులకే బహిరంగంగానే అధినేత చంద్రబాబు ముందు తన అసంతృప్తిని వెల్లగక్కారు కూడా. కానీ, ఈ మధ్య తమిళనాడు, మధ్యప్రదేశ్ గవర్నర్ స్థానాలు ఖాళీలు అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్ కోవాను సుప్రీంకోర్టు తొలగించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ఆయా గవర్నర్ పదవులను భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఈ క్రమంలోనే టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ భాద్యతలు అప్పజెప్పాలని పావులు కదులుతున్నాయంట. ఇప్పటికే ఆయన బయోడేటా కేంద్ర ప్రభుత్వం చేతికి అందిందని, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన గవర్నర్ కావటం ఖాయమని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDP  Motkupalli Narasimhulu  Arunachal Pradesh  Governor  

Other Articles