నవ్యాంధ్ర రాజధానిలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఖరారు | Cambridge university confirmed in Ap capital amaravati

Cambridge university confirmed in ap capital amaravati

Cambridge university confirmed for AP, Cambridge university in amaravati, Cambridge Campus in Amaravati, Cambridge University Excellence center in AP

Cambridge university confirmed in Ap capital amaravati.

నవ్యాంధ్రకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ కన్ఫర్మ్ అయినట్లే...

Posted: 09/13/2016 09:11 AM IST
Cambridge university confirmed in ap capital amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. భారత‌దేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయాలని వర్సిటీ ప్రతినిధులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రవీంద్రబాబు తదితరులతో యూనివర్సిటీ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. వర్సిటీతోపాటు సెంటరాఫ్ ఎక్సలెన్సీని కూడా ఏర్పాటు చేయనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ కలసి ఉమ్మడి వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు ఈ వర్కింగ్‌ గ్రూప్‌ చర్యలు చేపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని, అందులో భాగంగానే కేంబ్రిడ్జ్‌ వర్సిటీ ప్రతినిధులతో సమావేశమయ్యామన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి సమావేశమవుతామని, విశ్వవిద్యాలయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వర్సిటీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి.

సుమారు 900 ఏళ్ల చరిత్ర ఉన్న కేంబ్రిడ్జ్ వర్సిటీ విద్యారంగానికి మక్కా లాంటిది. 100 కి పైగా అకాడమిక్ డిపార్ట్ మెంట్లు, 30 అనుబంధ కళాశాలలున్న ఈ విద్యాలయానికి అమరాతితో ఇప్పుడు కొత్త అనుబంధం కావటం నిజంగా విశేషమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Amaravati  Cambridge University  

Other Articles