రాజద్రోహం కేసులపై ‘సుప్రీం కోర్టు’ క్లారిటీ.. Sedition charges can't be slapped for criticising government, clarifies Supreme Court

No sedition laws against critics clarifies supreme court

sedition charge, defamation charge, india defamation, sedition, supreme court defamation, news, legal news, supreme court news, supreme court judgments, supreme court clarrfications, india news, national news, latest news

The observation came as Advocate Prashant Bhushan, appearing for an NGO, said sedition was a serious offence and the law on it was being grossly misused for stifling dissent.

రాజద్రోహం కేసులపై ‘సుప్రీం’ క్లారిటీ..

Posted: 09/06/2016 11:13 AM IST
No sedition laws against critics clarifies supreme court

దోహద్రోహం, రాజద్రోహం కింద అభియోగాలను ఎదుర్కోంటూ కారాగారవాసం గడిపుతున్న వారికి.. అభియోగాలను ఎదుర్కోంటున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. రాజద్రోహం కేసును పోలీసులు ఏయే సందర్భాలలో అమలు చేయాలన్న విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం రాజద్రోహం కిందికి రాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ‘‘ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పరువునష్టం కిందికో, రాజద్రోహం కిందికో రాదు’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఈ తీర్పును అనుసరించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, జడ్జిలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అటువంటి విమర్శలు హింసకు దారితీసినా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైనా అప్పుడు అది రాజద్రోహం కిందకి వస్తుందని స్పష్టం చేస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఉదయ్ యు లలిత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా 1962 నాటి కేదార్‌నాథ్ సింగ్, బీహార్ రాష్ట్రాల మధ్య జరిగిన కేసును ఉదహరించింది.

అయితే తాను దేశద్రోహానికి సంబంధించిన పనులు చేయలేదని, కేవలం కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వాన్ని మాత్రమే విమర్శించానని, ఈ రెండింటికీ మధ్య చాలా వ్యత్యాముందని చెబుతూ వచ్చిన ఢిల్లీ జవహార్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ సహా ఆయన సహచరులపై దాఖలైన కేసులు కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టతతో కొత్త మలుపు తీసుకోనుందని పలువరు భావిస్తున్నారు. అటు ఇదే తరహా కేసులను ఎదుర్కోంటున్న పలువరు రాష్ట్రాల విపక్ష నేతలకు కూడా సుప్రీం ఊరటనిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  sedition charge  defamation case  legal news  

Other Articles