Lower rates no substitute for broader policy reforms: Raghuram Rajan

Raghuram rajan has a new warning for the world on low interest

Raghuram Rajan, RBI, Urjit Patel , Lower rates no substitute for broader policy reforms: Raghuram Rajan,news, India news,Economy Policy News, Economy Policy News in India,

Warning against low interest rates, former RBI governor Raghuram Rajan has said such measures by central banks cannot substitute other policy instruments and broader reforms

అల్విదా చెప్పిన రాజన్.. తనపై అరోపణలకు సమాధానం..

Posted: 09/06/2016 09:45 AM IST
Raghuram rajan has a new warning for the world on low interest

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ గా తన బాధ్యతలను అకుంఠిత దీక్షతో చేపట్టిన రమురామ్ రాజన్.. ఆ పదవికి వీడ్కోలు పలికిన తరువాత ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేస్తూనే.. తనపై విమర్శలను ఎక్కుపెట్టిన బీజేపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి పేరును ఎత్తకుండా సమాధానాలు ఇచ్చాడు. తక్కువ వడ్డీరేట్లపై మొగ్గుచూపుతున్న ప్రపంచ దేశాలను ఆయన హెచ్చరించారు. తక్కువ వడ్డీరేట్లు ఆర్థిక సంస్కరణలకు ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. ఈ మేరకు ఆయన న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అందోళనను వ్యక్తం చేశాడు.

తక్కువ వడ్డీరేట్ల విధానాలు పాటిస్తున్న అతిపెద్ద ఆర్థిక దేశాలు యూఎస్, యూరప్, జపాన్లు గ్లోబల్ ఎకానమీలో ఇంకా నిదానంగానే ఉన్నాయని తెలిపారు. ఎక్కడైతే మానిటరీ పాలసీ తేలికగా ఉంటుందో అక్కడ తక్కువ వడ్డీరేట్లు అవలంభించాలో లేదో నచ్చినట్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తక్కువ వృద్ది రేటు చూడాల్సి వస్తుందనే ఆందోళనతో వడ్డీరేట్లు పెంచడానికి చాలా సెంట్రల్ బ్యాంకులు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
 
కానీ ఆర్థికాభివృద్దిని పుంజుకునేలా చేయడానికి పాలసీలో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్గా రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేశారు. ఆయన తదుపరి గవర్నర్ బాధ్యతలను ఉర్జిత్ పటేల్ సోమవారం చేపట్టారు. రాజన్ ఆర్బీఐ పదవిలో కొనసాగినంత కాలం అధిక వడ్డీరేట్లను అవలంభించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ విధానాలే దేశంలో అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ఆర్థికాభివృద్ధి పరుగులు పెట్టడానికి దోహదం చేశాయని ఆర్థిక విశ్లేషకులు, మాజీ అర్బీఐ గవర్నర్లు, డిఫ్యూటీ గవర్నర్లు కొనియాడిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuram Rajan  RBI  Urjit Patel  Lower rates warning  economic policies  

Other Articles