ఒబామాపై విరుచుకుపడ్డాడు.. అనక క్షమాపణలు కోరాడు Obama Nixes Meeting After Rodrigo Duterte Lobs an Insult

Barack obama cancels rodrigo duterte talks after insult

US President Barack Obama, Rodrigo Duterte, White House spokesman, "son of a whore", Rodrigo Duterte regret, barack obama,laos,obama duterte meeting,operation double barrel,philippines,rodrigo duterte,u.s. philippines relations,Barack Obama,Rodrigo Duterte, international relations,human rights,civil liberties, domestic politics

Philippines President Rodrigo Duterte is expressing regret after his obscenity-laden rant against President Barack Obama prompted the White House to cancel planned bilateral talks between the two leaders.

ఒబామాపై విరుచుకుపడ్డాడు.. అనక క్షమాపణలు కోరాడు

Posted: 09/06/2016 12:22 PM IST
Barack obama cancels rodrigo duterte talks after insult

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిని కసితీరా తిట్టేసి, అనకూడని అసభ్యపదాలన్నీ వాడేసిన తరువాత.. వాడకూడని పరుష పదజాలాన్ని వాడేసిని పిమ్మడ.. తమ దోరణి పట్ల చింతిస్తున్నామంటూ కన్నీరు కార్ఛడం ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె వంతుగా మారింది. అమెరికా అధ్యక్షుడిపై నిప్పులు చెరగాలని బావిస్తున్న తాము.. బరాక్‌ ఒబామాను వ్యక్తిగతంగా దూషించినందుకు చింతిస్తున్నామని పేర్కోన్నారు. బహుశా ఈ నవంబరుతో ఆయన పదవీ కాలం ముగసిపోతుందు వల్ల కాబోలు ఆయన నేరుగా ఒబామాపై నోరు పారేసుకున్నారు.

తమ ఉద్దేశ్యం ఒబామాను దూషించాలన్నది కాదని, అయితే అదే సమయంలో తమ దేశంలో హరిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో తామేవరికీ బదులు చెప్పాల్సిన పని లేదని, తాను ఒక స్వతంత్ర దేశానికి అద్యక్షుడుగా వున్నానని, రోడ్రిగో చెప్పుకోచ్చారు. అయితే ఈ క్రమంలో వ్యక్తిగత దూషణ కూడా చేయడం తమ పోరబాటని చెప్పుకోచ్చారు. నిన్న ఆయన అధికార కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో ఒబామాను ఉద్దేశించి బూతుమాటలతో తిట్టారు. ఒబామా ఓ వెలయాలి కొడుకు అంటూ దారుణంగా మాట్లాడారు.

దీంతో చిర్రెత్తిపోయిన ఒబామా.. రోడ్రిగోతో తలపెట్టిన తన తొలి సమావేశాన్ని అర్ధంతరంగా రద్దుచేసుకున్నారు. లావోస్‌లో దక్షిణాసియా దేశాధినేతల వార్షిక సదస్సు సందర్భంగా తొలిసారి ఫిలిపినో అధ్యక్షుడు రోడ్రిగో- ఒబామా భేటీకి గతంలో షెడ్యూల్‌ ఖరారైంది. చైనాలోని హాంగ్‌ఝౌలో జీ20 సదస్సులో పాల్గొన్న అనంతరం ఒబామా తన గురించి రోడ్రిగో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యల గురించి తెలియగానే తన భేటీని రద్దు చేసుకున్నట్టు తెలిపారు. ఫిలిప్పీన్స్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపడంతోపాటు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా రోడ్రిగో ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆర్షించిన సంగతి తెలిసిందే.   

వైట్‌హౌస్‌ సిబ్బంది ద్వారా రోడ్రిగో వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఒబామా.. ఆయనతో సమావేశం దండుగ అనే నిర్ణయానికి వచ్చారు. తాము ఎవరితోనైనా చర్చలు జరిపితే.. అవి నిర్మాణాత్మకంగా, ప్రతిఫలం ఇచ్చేవిగా ఉండాలని కోరుకుంటున్నామని ఒబామా చెప్పారు. వియత్నాం రాజధాని లావోస్‌కు వచ్చిన ఒబామా దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్‌ జియున్‌-హైతో భేటీ అయ్యే అవకాశముంది. ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగాలపై వీరు ప్రధానంగా చర్చించవచ్చని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒకరు వియత్నానికి రావడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Rodrigo Duterte  Philippines  US  White House  Son of a Whore  

Other Articles