pawan kalyan's public meet may raise questions on AP special status

Pawan kalyan to question on special status to ap ar tirupati public meet

Pawan Jana Sena Prasthanam meeting, Jana Sena public meeting in tirupati, Jana Sena Prasthanam meeting, Janasena Indira ground, pawan kalyan tirupathi meeting, pawan kalyan special status to AP,

Tollywood hero turned politician Jana Sena chief Pawan Kalyan, may raise questions on special status for andhra pradesh, power star may even name munireddy at this meet.

ప్రస్థానం సాక్షిగా ప్రత్యేకహోదాపై నినదించనున్న పవన్..?

Posted: 08/27/2016 01:15 PM IST
Pawan kalyan to question on special status to ap ar tirupati public meet

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు భరోసా కల్పించేందుకే తిరుపతిలో అకస్మికంగా బహిరంగ ప్రకటన చేయనున్నారా..? కనీసం వారం రోజులు కూడా లేకుండానే సభను అంత హడావిడిగా ప్రకటించడం వెనుక అసలు కారణాలు ఏంటి..? సభా ఏర్పాటు చేయడానికి కనీసం 48 గంటల వ్యవధి కూడా లేకుండానే అంత హుటాహుటిన బహిరంగ సభను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

పవన్ ప్రసంగంలో రెండు ముక్కలు చెప్పినా చాలు...

తన అభిమాని వినోద్ రాయల్ మృతి వార్తతో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసేందుకు వచ్చిన పవన్.. అపై తిరుపతికి చేరుకుని.. అక్కడ బస చేసి.. ఏకంగా బహిరంగ సభను నిర్వహిస్తానని ప్రకటించడంపై రాష్ట్రంలోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సభతో తన పార్టీ ప్రస్థానం ప్రారంభమవుతుందని ప్రకటించిన పవన్.. దీంతో తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు కూడా గట్టి భరోసా ఇవ్వనున్నారు. రెండేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రారంభమైన పార్టీ కేవలం విజయవాడలోని అమరావతి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. సానుకూలంగా పరిష్కరించడంతో మాత్రమే సక్సెస్ అయ్యింది.

తిరుపతిలో జనసేన ప్రస్థానం పేరిట పవన్ బహిరంగసభ...

విజయవాడ కేంద్రంగా పవన్ కల్యాన్ తన రాజకీయ పార్టీకి నూతనోత్తేజం తీసుకువస్తారని అక్కడి ప్రజలు భావించారు. అయితే వారి కోసం వెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు మాత్రమే పవన్ అసక్తి చూపారు. అయితే ఇటీవల సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదలైన తరువాత తాను త్వరలో తన రాజకీయ పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువచ్చేందుకు కార్యచరణ రూపొందిస్తున్నానని చెప్పారు. అయితే తన అభిమాని మరో హీరో అభిమాని చేతిలో కత్తిపోటుకు గురై మరణించడాన్ని జీర్ణించుకోలేని పవన్.. తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు నేనున్నాను అన్న ఒక సందేశాన్ని పంపేందుకు పూర్తి స్థాయి రాజకీయ నేతగా అవతరించి.. పార్టీని ప్రస్థానం పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

ITEMVIDEOS:మితిమీరిన అభిమానం మంచిది కాదు-పవన్ 

ఇదిలావుండగా, జనసేన అధినేత పవన్ కల్యాన్ బహిరంగ సభ నిర్వహిస్తున్న క్రమంలో అటు టీడీపీ, బీజేపి నేతల గుండె్ల్లో రైలు పరిగెడుతున్నాయి. నవ్యాంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హదా తీసుకువస్తానమి ఎన్నకల హామీని ఇవ్వడమే కాకుండా.. ప్రత్యేక హోదా కోసం తనను కూడా ఆయా పార్టీలకు ఓట్లు వేయించేలా ఓటర్లకు చెప్పేలా ప్రభావితం చేసిన పార్టీలు ఇప్పుడు మాట తప్పడంపై పవన్ తిరుపతి శ్రీనివాసుడి సాక్షిగా ఆయా పార్టీలపై విరుచుకుపడనున్నారు. తిరుపతిలో మునికోటి అనే కాంగ్రెస్ నేత ప్రత్యేక హోదా కోసం చేసుకున్న అత్మబలిదానాన్ని కూడా పవన్ ప్రస్తావించనున్నారని సమాచారం.

ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపి.. మాట మార్చడం.. నీతి అయోగ్ చేతుల్లోకి అంశాన్ని పెట్టి రెండేళ్లుగా నాన్చడంపై కూడా పవన్ విమర్శలు గుప్పించనున్నారు. దీంతో పాటు ఇటు చంద్రబాబు ప్రభుత్వంపై కూడా పవన్ మండిపడనున్నట్లు తెలుస్తుంది. వాజ్ పాయ్ హయాంలో కేంద్రంలో చక్రం తిప్పిన బాబు.. మోదీ హాయంలో మాత్రం నీళ్లు మింగుతున్నారు. అసలు కేంద్రాన్ని తమకు ప్రత్యేక హోదా ఎందుకు కావాలన్న విషయమై కూడా వివరణాత్మకంగా వివరించే పరిస్థితలో కూడా టీడీపీ లేదని కూడా చరకలంటించనున్నారు. దీంతో పాటు ఇంకా ఏయే అంశాలపై పవన్ తమను తూర్పారబడుతారోనని నేతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jana Sena  Prasthanam  public meeting  special status  Andhra pradesh  

Other Articles